
పచ్చిమిర్చి, ఎండు ఎరుపు రంగు మిర్చి, ఈ రెండు ఆరోగ్యానికి మంచివే, కానీ ఎరుపు రంగు మిర్చీతో పోలిస్తే పచ్చి మిర్చిలో పోషకాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, కానీ పచ్చి మిర్చి తినే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట, అవి ఏవి అంటే? ఎప్పుడు కూడా పచ్చి మర్చిని నేరుగా కాకుండా ఉడకబెట్టి తినాలంట. వీటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందంటే?

పచ్చి మిర్చి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు మిర్చితో పోలిస్తే ఇది వ్యక్తి శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. అంతే కాకుండా, ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తాయంట. అంతే కాకుండా దీని వలన చర్మం సురక్షితంగా ఉండటమే కాకుండా, ఇది ఐరన్ లోపాన్ని కూడా అధిగమిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అదే విధంగా ఎండు మిర్చీతో పోలిస్తే, దీనిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన దీనిని తినడం వలన డీ హైడ్రేషన్ సమస్య తగ్గిపోతుంది. ఎరుపు రంగు మిర్చీలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం అధికంగా ఉండటం వలన ఇది కొవ్వు త్వరగా కరిగిపోయేలా చేస్తుందంట. అంతే కాకుండా ,దీనిని తినడం వలన త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉన్నదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎండు మిర్చీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ, ఎరుపు రంగు మిర్చీతో పోలిస్తే ఆకుపచ్చ రంగు మిర్చీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట.పచ్చి మిర్చీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తే, ఎరుపు రంగు మిర్చి, దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, అంతే కాకుండా ఇది ఒళ్లు నొప్పుల నుంచి మీకు ఉపశమనం కలిగేలా చేస్తుందంట. అయితే ఇందులో ఎది తినడం ప్రయోజనకరమో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ పచ్చి మిర్చి కంటే ఎండు మిర్చి తినడమే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎండు మిర్చిలో పొటాషియం అధికంగా ఉంటుంది, అందువలన ఇది రక్త సరఫరాను మెరుగు పరిచి, బీపీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అయితే పచ్చి మిర్చీ విటమిన్ సి, ఉంటుంది ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది. కానీ, గ్యాస్ ఎసిడిటీ, వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారిలో ఇది కడుపు సమస్యలను పెంచే ప్రమాదం ఉన్నదంట.