మొత్తానికి దొరికేసింది.. కోడి ముందా? గుడ్డు ముందా? ప్రశ్నకు జవాబు ఇదేనట! ఈ లాజిక్ ఎలా మిస్సయ్యాం

Updated on: Aug 01, 2026 | 6:50 PM

చాలా మందికి అంతుచిక్కని ప్రశ్నల్లో కోడి ముందా? గుడ్డు ముందా? అనేది కూడా ఒకటి. చాలా సంవత్సరాలు దీనికి సమాధానం తెలియక జనాలు తికమకపడుతున్నారు. కానీ ఎట్టకేలకు దీనికి సమాధానం దొరికింది. పరిణామ విజ్ఞానం, జీవ రసాయన శాస్త్రం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నారు. ఇంతకూ ఆ జవాబు ఏంటనే మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

1 / 5
చాలా సంవత్సరాలుగా అంతుచిక్కని కోడిమందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. పరిమాణ, జీవశాస్త్రం ఆధారంగా దీనికి సమాధానం కనిపెట్టారు శాస్త్రవేత్తలు. వారి ప్రకారం.. సాధారణంగా జీవ పరిణామ క్రమంలో గుడ్డు కోడి కంటే చాలా సంవత్సరాల ముందే ఉనికిలోకి వచ్చింది. భ్రూణం సురక్షితంగా పెరగడానికి ఒక రక్షణ కవచంగా ఉన్న గుడ్లు సుమారు 340 మిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపైకి వచ్చాయని తెలుస్తోంది..

2 / 5
విశ్వంతో కొడికంటే ముందే అమ్నియోట్స్ అనే జంతువులు నీటికి దూరంగా, పొడి నేలపై గుడ్లు పెట్టడం ప్రారంభించాయట. ఆ సమయంలో డైనోసార్ల, ఈ జంతువులు మాత్రమే గుడ్లు పెట్టేవి.. అప్పుడు అసలు కోళ్ళ ఉనికి అనేదే లేదట. కాబట్టి, జీవ పరిణామ క్రమంగా చూసుకుంటే గుడ్డు అనే దృష్టితో చూస్తే కోడి కంటే గుడ్డే మొదటిది అవుతుంది!

3 / 5
మొదటి కోడి ఎలా పుట్టింది?: శాస్త్రవేత్తల ప్రకారం, కోళ్ళు జీవపరిణామ క్రమంలో సుమారు 58,000 సంవత్సరాల క్రితం ఆసియాలోని అడవి కోళ్ళ నుండి విడిపోయి కొత్త జాతిగా మారాయి. రెండు ప్రోటో-కోళ్ళు అంటే పూర్తిగా కోడి కాకుండా, కోడికి చాలా దగ్గరగా ఉండే పూర్వీక పక్షులు కలయిక వల్ల ఒక అండం ఏర్పడి.. ఆ అండంలో ఒక రకమైన జన్యు పరివర్తనం జరిగి ఏర్పడిన భ్రూణమే ప్రపంచంలో మొదటి నిజమైన కోడి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మొదటి కోడి ఒక గుడ్డు లోపల నుంచే బయటకు వచ్చింది.. కాబట్టి గుడ్డే ముందు!

4 / 5
కోడి గుడ్డు ముందా?: అయితే, ప్రత్యేకంగా కోడి గుడ్డు గురించి మాట్లాడితే మాత్రం కథ పూర్తిగా మారిపోతుంది. కోడి గుడ్డు పెంకు రూపుదిద్దుకోవడానికి OC-17 అనే ప్రత్యేకమైన ప్రోటీన్ అవసరం అవుతుంది. ఈ ప్రోటీన్ కేవలం కోడి అండాశయంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇది కాల్షియం కార్బోనేట్‌ను కాల్సైట్ స్ఫటికాలుగా మార్చి గట్టి పెంకును తయారుచేస్తుంది. అంటే, కోడి శరీరంలో తప్ప ఈ ప్రోటీన్ వేరెక్కడా తయారవ్వదు. కాబట్టి ఒక నిజమైన కోడి గుడ్డు రూపుదిద్దుకోవాలంటే కోడి ఉండితీరాలి.

5 / 5
మొత్తానికి సాధారణ గుడ్డు అనేది కోడి కంటే మిలియన్ల సంవత్సరాల ముందే వచ్చింది. కాబట్టి గుడ్డే ముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కోడి పరంగా చేసుకుంటే మాత్రం.. నిర్దిష్టమైన గుడ్డు తయారవ్వడానికి కోడి అండాశయంలోని OC-17 ప్రోటీన్ అవసరం కాబట్టి ఈ కోణంలో కోడే ముందు.

Loading...
Unable to load recommendations.
Follow Us