
వర్షా కాలంలో సాయంత్రం టైం లో వేడి వేడి టీతో తినడానికి ఏదైనా స్నాక్స్ ఉందంటే అది గోధుమ పిండి, ఉలిపాయ పకోడీలనే చెప్పాలి. ఎందుకంటే ఈ రుచి అంత అద్భుతంగా ఉంటుంది శనగపిండికి బదులు గోధుమ పిండిని వేస్తే కమ్మగా ఉంటుంది కర కర లాడుతూ తినడానికి మంచిగా ఉంటుంది. ఈ పకోడీలు ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి.

కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం, ఉల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ను తీసుకోవాలి.

గోధుమ పిండి ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయను తీసుకుని కడిగి, తరిగి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇంకా దీనిలో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఆకులు కూడా వేసి కలపాలి. వీటితో పాటు గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చి కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసి కలపాలి.

గోధుమ పిండి, ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం స్టెప్ 1 : ఈ మిశ్రమంలో నీరు పోసి పిండి మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక చిన్న ముద్దలుగా వేసి మీడియం మంట పై మధ్య మంటపై రంగు మారే వరకు వీటిని బాగా వేయించాలి. ఒక వైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి.

రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి ఇంకా ఇది కరకరలాడాలంటే ఇంకోసారి వీటిని వేయించాలి ఆ తర్వాత వాటిని తీసి ఒక టిష్యూపై పెట్టాలి. ఈ వేడి వేడి గోధుమ పిండి, ఉల్లిపాయ పకోడీలు రెడీ. పల్లిల చట్నీతో కానీ కానీ పుదీనా చట్నీతో కానీ తింటే రుచి అదిరిపోతోంది.