Salt: ఉప్పు ఆరోగ్యానికి ముప్పే.. రోజులో ఎంత ఉప్పు తినాలి? ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..

Updated on: Jun 20, 2025 | 12:20 PM

షడ్రుచుల్లో ఉప్పు ఒక రుచి. దీనిని లవణం అని కూడా అంటారు. ఉప్పు ఆహారానికి రుచిని అందిస్తుంది. అంతేకాదు శరీరానికి అవసరమైన లవణాలను కూడా అందిస్తుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు రుచికరమైన ఉప్పు కూడా ఆరోగ్యానికి ముప్పే.. అయినా సరే చాలా మంది భారతీయులు అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు తింటారు. వాస్తవానికి ఒక రోజులో ఎన్ని గ్రాముల ఉప్పు తినాలో ప్రజలకు తెలియదు. రోజులో ఉప్పు ఎంత తినాలి? అధికంగా తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..

1 / 6
ఉప్పును ఎల్లప్పుడూ సరైన పరిమాణంలో తీసుకోవాలి. లేకుంటే ఉప్పు శరీరానికి హానికరం. ఎవరైనా సరే రుచి కోసం అంటూ ఎక్కువ ఉప్పు తింటే అది కడుపుకు మంచిది కాదు. ఉప్పు మన శరీరానికి అవసరమైన పోషకంగా పనిచేస్తుంది. కనుక ఒక రోజులో ఎంత ఉప్పు తీసుకోవాలో తెలుసుకుందాం.

2 / 6
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఒక వ్యక్తి ఒక రోజులో 5 గ్రాముల (1 టీస్పూన్) కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. అయితే భారతీయులు ఒక రోజులో 10 నుంచి 15 గ్రాముల ఉప్పు తీసుకుంటారు. దీని కారణంగా చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.

3 / 6
ఉప్పు ఎక్కువ తీసుకోవడం వలన కలిగే అనారోగ్య ప్రయోజనాల గురించి ఢిల్లీలోని ధర్మశాల నారాయణ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కపిల్ కుమార్ కుర్షివాల్ అనేక విషయాలను చెప్పారు. ఒక రోజులో 5 గ్రాముల ఉప్పు మన శరీరంలో 2000 మిల్లీగ్రాముల సోడియంను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. దీంతో ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుందని.. దీనివల్ల రక్తపోటు కూడా పెరుగుతుందన్నారు.

4 / 6
రోజువారీ పరిమితి కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటే.. అది కడుపు, కాలేయం లేదా ఇతర అవయవాల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో గుండెల్లో మంట, ఆమ్లత్వం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కలిగి ఎల్లప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తప్పు చాలా కాలం పాటు పునరావృతమైతే.. అప్పుడు జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. దీంతో జీర్ణం అవ్వడం లేదని ఫిర్యాదు చేస్తారు.

5 / 6
ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ తక్కువ ఉప్పు తినాలి. రుచికరం అంటూ ఉప్పుని అధికంగా తీసుకుంటే అప్పుడు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

6 / 6
ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఎముకలకు హానికరం. ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి.