మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. అదృష్టం, ధనయోగం మీ చెంత ఉందో లేదో తెలిపే సీక్రెట్‌ ఇదే!

Updated on: Aug 14, 2026 | 9:45 PM

భారతీయ సనాతన సాంప్రదాయంలో సాముద్రిక శాస్త్రం అత్యంత ప్రాచీనమైనది. వ్యక్తి శరీర నిర్మాణం, ముఖ లక్షణాలు, అరచేతి గీతలు, చేతి గోళ్ల ఆకారాన్ని బట్టి వారి భవిష్యత్తు, వ్యక్తిత్వం, ఆర్థిక స్థితిని అంచనా వేయవచ్చని ఈ శాస్త్రం చెబుతోంది. మనం సాధారణంగా భావించే గోళ్లు కూడా మన అదృష్టాన్ని, సంపదను సూచించే కీలక సంకేతాలుగా పనిచేస్తాయి. ఎలాంటి గోళ్లు ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5
సాముద్రిక శాస్త్రం ప్రకారం మనుషుల శరీర అవయవాల ఆకృతిని బట్టి వారి భవిష్యత్తు, స్వభావం, అదృష్టాన్ని అంచనా వేయవచ్చు. అందులో చేతి గోళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రంగులో, పరిశుభ్రంగా మరియు నునుపుగా ఉండే గోళ్లు ఉన్నవారు ఎంతో అదృష్టవంతులని, వారికి జీవితంలో ధనలాభం, విజయం సులభంగా లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. విరిగిపోయినట్లు లేదా నల్లటి మరకలు ఉన్న గోళ్లు ఆర్థిక సమస్యలను, ఆరోగ్య రుగ్మతలను సూచిస్తాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

2 / 5
గులాబీ రంగు గోళ్లు: సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎరుపు లేదా గులాబీ రంగులో మెరుస్తూ ఉండే గోళ్లు అత్యంత శుభప్రదమైనవి. ఇలాంటి గోళ్లు ఉన్నవారు సహజంగానే అదృష్టవంతులు. వీరికి జీవితంలో ధనధాన్యాలకు కొదువ ఉండదు. వ్యాపారం లేదా ఉద్యోగంలో స్వల్ప శ్రమతోనే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.

3 / 5
గోళ్లపై అర్థచంద్రాకారం: చాలామంది గోళ్ల మొదట్లో తెల్లటి నెలవంక లేదా అర్థచంద్రాకారం వంటి గుర్తు కనిపిస్తుంది. గోరుపై స్పష్టమైన, పెద్ద అర్థచంద్రాకారం ఉంటే సదరు వ్యక్తికి జీవితంలో అనుకోని ధనలాభం కలుగుతుందని అర్థం. బొటనవేలి గోరుపై ఈ గుర్తు ఉన్నవారికి సమాజంలో అధికారం, మంచి హోదా, ప్రశంసలు లభిస్తాయి.

4 / 5
పొడవైన, నునుపైన గోళ్లు: ఎవరి గోళ్లయితే పొడవుగా, పరిశుభ్రంగా, ఎత్తుపల్లాలు లేకుండా సమంగా ఉంటాయో వారు ఎంతో బుద్ధిమంతులు, సృజనాత్మకత కలవారు. వీరు తమ తెలివితేటలతో ఆర్థికంగా త్వరగా ఎదుగుతారు. కుటుంబ జీవితంలో కూడా సుఖసంతోషాలు నిండి ఉంటాయి.

5 / 5
ఎలాంటి గోళ్లు అశుభం?: గోళ్లపై నలుపు లేదా పసుపు రంగు మచ్చలు, చారలు ఉంటే అది రాబోయే ఆర్థిక నష్టాలను లేదా ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. నిరంతరం విరిగిపోయే లేదా గరుకుగా ఉండే గోళ్లు ఉన్నవారు జీవితంలో తీవ్ర శ్రమ చేయాల్సి వస్తుందని, ధన సంపాదనలో ఆటంకాలు ఎదురవుతాయని శాస్త్రం చెబుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us