Weight Tips: పడుకునే ముందు ఇలా చేస్తే.. గుట్ట కూడా ఇట్టే కరగాల్సిందే.! ట్రై చేయండి

|

Sep 23, 2024 | 5:45 PM

పని ఒత్తిడి, టైంకి భోజనం సరిగ్గా చేయకపోవడంతో చాలామంది ఈ మధ్య ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఇక ఆ గుట్టలాంటి పొట్టను తగ్గించేందుకు డైటింగ్ స్టార్ట్ చేయడం లేదా.. రైస్ మానేయడం లాంటివి చేస్తుంటారు కొందరు.

1 / 7
సాధారణంగా చాలా మంది బరువు తగ్గేందుకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతుంటారు. అయితే, సాధారణ నిమ్మకాయ నీటి కంటే అల్లం, నిమ్మ నీరు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

2 / 7
 ఈరోజుల్లో ఊబకాయం అనేది అందరికీ ఓ ప్రధాన సమస్యగా మారిపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మితిమీరిన ఫాస్ట్ ఫుడ్, లెక్కాపత్రం లేని డైట్ ప్లాన్, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం లాంటి అంశాలు ఊబకాయానికి దారి తీస్తున్నాయి. దీని వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం పెరగవచ్చు. ఇక బరువును కంట్రోల్ చేసేందుకు కొందరు జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. అయితే దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆహారం, జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి మీకు సహాయపడే 5 చిట్కాలు ఇలా ఉన్నాయి.

3 / 7
రాత్రి 7 గంటలకు ముందు డిన్నర్:   మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి 7 గంటలలోపు డిన్నర్ తినడం అలవాటు చేసుకోండి. రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలి. అర్ధరాత్రి వేళ భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగ్గా అవ్వదు. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోండి.

4 / 7
తేలికపాటి ఆహారాన్ని తినండి:   రాత్రిపూట ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గడానికి డిన్నర్‌లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని డైట్ ప్లాన్‌లో ఉంచుకోండి. రాత్రిపూట మీరు పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్ లాంటివి తినవచ్చు. మీకు అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే, దోసకాయ లేదా ఆపిల్ తినవచ్చు.

5 / 7
త్వరగా నిద్రపోవడం:   మనం త్వరగా నిద్రపోతున్నప్పుడు, మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ని సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

6 / 7
పసుపు పాలు తాగడం:   పసుపు పాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు సహాయపడుతాయి. పసుపులో కొవ్వును కరిగించడానికి సహాయపడే థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీనితో పాటు, ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగండి.

7 / 7
కనీసం 7 గంటల నిద్ర:   ఊబకాయంతో నిద్రకు సంబంధం ఉంది. బరువు తగ్గడానికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే, అది మీ జీవక్రియను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడం కష్టతరం అవుతుంది.