ఇవి పాములు కాదు చేపలే..! ఒక్కోటి 6 అడుగులకు మించి.. మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన జలపుష్పాలు..

|

Nov 28, 2022 | 11:02 AM

ఈ చేప సాధారణంగా భారతదేశం, బంగ్లాదేశ్‌లోని సుందర్‌బన్స్ ప్రాంతంలోని ఉప్పునీటి నదులలో కనిపిస్తుంది.

1 / 7
దాదాపు మూడున్నర కిలోల బరువుండే అరుదైన జాతి పాములాంటి చేపలను మత్స్యకారులు పట్టుకున్నారు.

2 / 7
సుందర్‌బన్స్‌లోని రాయమంగల్ నదిలో మత్స్యకారుల వలలో 6 అడుగుల పాములాంటి అరుదైన చేప చిక్కింది.

3 / 7
బసిర్‌హట్‌లోని మారుమూల సుందర్‌బన్స్‌లోని హింగల్‌గంజ్‌లోని రాయమంగల్ నదిలో మత్స్యకారుడు అనుప్ మండల్ వలలో భారీ చేప చిక్కుకుంది. చేప చూసేందుకు దాదాపు పాములాగే కనిపిస్తుంది.

4 / 7
స్థానికులు ఈ చేపను 'సత్ హతి'గా పిలుస్తారని సమాచారం. చేప శాస్త్రీయ నామం మోనోప్టెరస్ కుచియా. ఈ చేప బరువు దాదాపు మూడున్నర కిలోలు. చేప దాదాపు 6 అడుగుల పొడవు ఉంటుంది.ఈ చేప సాధారణంగా భారతదేశం, బంగ్లాదేశ్‌లోని సుందర్‌బన్స్ ప్రాంతంలోని ఉప్పునీటి నదులలో కనిపిస్తుంది.

5 / 7
ఇలాంటి అరుదైన చేపలు దొరికాయనే వార్త వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా హడావుడి మొదలైంది. చేపలను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దాంతో మార్కెటంతా కోలాహలంగా మారింది. ఈ చేపను కొనుగోలు చేసేందుకు చేపల ప్రియులు కూడా బారులు తీరారు.

6 / 7
హింగల్‌గంజ్‌లోని అంబేరియా మార్కెట్‌కు చేపలను తీసుకురాగా, వాటిని చూసేందుకు జనం గుమిగూడారు.

7 / 7
అయితే, ఈ అరుదైన చేపల ధర మాత్రం తెలియలేదు. హసనాబాద్ మత్స్యశాఖకు వీటిని విక్రయించినట్టుగా తెలిసింది.