
మధుమేహ నియంత్రణ అనేది కేవలం ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ స్థాయిలను చూడటం వలన మాత్రమే సాధ్యం కాదని, దీర్ఘకాలిక నియంత్రణకు HbA1c పరీక్ష అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ స్థాయిలు మనం ముందు తిన్న ఆహారాన్ని బట్టి మారుతుంటాయి. అయితే, HbA1c పరీక్ష గత మూడు నెలల సగటు రక్తంలో గ్లూకోస్ స్థాయిని తెలియజేస్తుంది, దీనివల్ల షుగర్ నియంత్రణలో ఉందా? లేదా? దానివల్ల అవయవాలకు నష్టం జరిగే అవకాశం ఉందా అనే స్పష్టమైన అవగాహన వస్తుంది. నియంత్రణ లేని షుగర్ ఉన్నవారికి తక్కువ వయస్సులోనే, తక్కువ సంవత్సరాల్లోనే ఎక్కువ నష్టం జరిగి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆయన హెచ్చరించారు.

గతంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి తినేవారు, కానీ ఇప్పుడు వైద్యులు ఎక్కువసార్లు తినడం, ఎక్కువ మందులు వేసుకోవడం కంటే తక్కువసార్లు తిని నియంత్రించుకోవడమే మంచిదని చెబుతున్నారు. ఉదయం (9:30 - 10:00 గంటల మధ్య) ఉదయం నిద్ర లేవగానే నీరు త్రాగి, మలవిసర్జన తర్వాత ఒక గంట వ్యాయామం చేయాలి. తరువాత ఒక గ్లాసు (250-300 ml) వెజిటబుల్ జ్యూస్, అందులో ఒకటి, రెండు స్పూన్ల తేనె కలుపుకుని త్రాగాలి. జ్యూస్ తాగిన 45 నిమిషాల నుంచి ఒక గంట తర్వాత, ఒకటి లేదా రెండు పుల్కాలు తీసుకోవాలి.

అర కిలో నుంచి ముప్పావు కిలో వరకు ఉప్పు లేకుండా వండిన కూరగాయలు, ఇంకా పప్పు లేకుండా వండిన ఆకుకూరలు (పొట్టు తీయని పప్పులతో కలిపి వండినవి) ఎక్కువగా తీసుకోవాలి. ఇది గ్లూకోస్ నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది. ఒక కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. సాయంత్రం (5:00 - 6:00 గంటల మధ్య): భోజనం తర్వాత సాయంత్రం 4 గంటల వరకు నీళ్లు తాగుతూ ఉండాలి. సాయంత్రం 4:00 - 4:30 గంటల మధ్య ఒక గ్లాసు కొబ్బరిబొండం నీళ్లు త్రాగాలి. ఆ తరువాత, రెండు మూడు రకాల మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్), వాల్‌నట్స్, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి మూడు నాలుగు రకాల నట్స్ (ముందే నానబెట్టినవి) తీసుకోవాలి.

జామకాయ, దానిమ్మ, రేగుపండ్లు, బొప్పాయి, కర్బూజ వంటి పండ్లు తినాలి. డిన్నర్ 6:30 లోపే పూర్తి చేయాలి. డిన్నర్ తర్వాత ఒక గంట నడవడం చాలా మంచిది. రెండు పూటలా ఆహార ప్రణాళికను మూడు నెలలు ఆచరిస్తే HbA1c 6 కంటే తక్కువకు వస్తుందని, మెడికేషన్ కూడా తగ్గించుకుంటూ చెబుతున్నారు. ఇంకా మీరు ఉప్పు పూర్తిగా మానివేస్తే నెల రోజుల్లోనే మందులు పూర్తిగా మానేయవచ్చని అంటున్నారు.

మూడు పూటలా తినాలనుకునేవారు ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగి, కొద్దిసేపటి తర్వాత మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవాలి. మధ్యాహ్నం ఒక పుల్కా, ఎక్కువగా కూరలు, ఆకుకూరలు, పప్పుతో తినాలి. సాయంత్రం 6-7 గంటల మధ్య నానబెట్టిన ఎండు విత్తనాలు, జామ, దానిమ్మ వంటి పండ్లు తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం ఒక గంట వ్యాయామం, రాత్రి భోజనం తర్వాత ఒక గంట నడక తప్పనిసరి.