వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

Updated on: Apr 09, 2026 | 8:28 AM

Warm vs Cold Water: ఎండలు మండిపోతున్నాయి.. దాహం దంచికొడుతోంది. ఇలాంటి సమయంలో ఫ్రిజ్ లోని చల్లటి నీరు చూడగానే అమృతంలా కనిపిస్తుంది. కానీ ఆ చల్లటి నీరు మీ జీర్ణవ్యవస్థను ఎంతలా దెబ్బతీస్తుందో మీకు తెలుసా? వేసవిలోనూ గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటి? అసలు ఈ కాలంలో ఎలాంటి నీరు తాగడం శ్రేయస్కరం? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
భానుడి భగభగలతో వేసవి వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. బయట ఎండ నుంచి రాగానే గొంతు తడుపుకోవడానికి మనలో చాలామంది వెంటనే ఫ్రిజ్‌ వైపు పరుగులు తీస్తుంటారు. గడ్డకట్టే ఐస్ వాటర్ తాగితే కానీ ఆ దాహం తీరదు. అయితే ఈ క్షణికమైన హాయి వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
చల్లటి నీరు: వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి వెంటనే చల్లదనం లభించినట్లు అనిపిస్తుంది. కానీ, ఇది శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గించేస్తుంది. చల్లటి నీరు జీర్ణనాళంలోని రక్తనాళాలను కుంచింపజేస్తుంది, దీనివల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా అరగదు. భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగడం వల్ల ఆహారంలోని కొవ్వు పదార్థాలు గట్టిపడి, అజీర్ణం, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.

3 / 5
వేడి లేదా గోరువెచ్చని నీరు: చాలామందికి ఎండలో వేడి నీళ్లు తాగడం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది శరీరంలోని వ్యర్థాలను చెమట రూపంలో బయటకు పంపి, శరీరాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది. గోరువెచ్చని నీరు రక్తనాళాలను వ్యాకోచింపజేసి, శరీరమంతా రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరిగి, బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.

4 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవిలో మరీ చల్లటి నీరు లేదా మరీ వేడి నీరు కాకుండా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగడం అత్యంత ఉత్తమమైన పద్ధతి. ముఖ్యంగా బయటి ఎండ నుంచి రాగానే కనీసం 10-15 నిమిషాల వరకు నీరు తాగకూడదు. శరీరం సాధారణ స్థితికి వచ్చాక మాత్రమే నీరు తీసుకోవాలి.  మట్టి కుండలో నీరు తాగడం వల్ల సహజమైన చల్లదనం లభించడమే కాకుండా నీటిలోని pH విలువ సమతుల్యంగా ఉంటుంది.

5 / 5
హైడ్రేటెడ్‌గా ఉండటానికి చిట్కాలు: సగటున ఒక వ్యక్తి రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మరికొంత అధికంగా తీసుకోవాలి. కేవలం నీటితోనే కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ రసం, నిమ్మరసం వంటి సహజ పానీయాలతో దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో దాహం వేసినప్పుడు నాలుకను మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని సరైన పద్ధతిలో నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

Follow Us