2 / 6
ఆనంద్ భవన్: ఈ భవనం నెహ్రూ కుటుంబానికి పూర్వీకుల నివాసం. నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన నివాసం అయిన ఆనంద్ భవన్, పురాతన కట్టడాలను ఇష్టపడే వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఈ ప్రసిద్ధ భవనంలోనే భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన బాల్యాన్ని గడిపారు. ఇప్పుడు మ్యూజియంగా మార్చబడిన ఈ భవనంలో నెహ్రూ కుటుంబానికి చెందిన ఛాయాచిత్రాలు, పత్రాలు, వ్యక్తిగత వస్తువులు సందర్శన కోసం ఉంచారు. అంతేకాదు, అక్కడి నమూనాలు భారత స్వాతంత్య్ర పోరాట దశను కూడా కళ్లకు గట్టినట్లుగా చూపిస్తాయి. చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను మీరు ఇక్కడ చూడవచ్చు.