
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

వచ్చే నెలలో శని, చంద్రుల సంయోగంతో విష యోగం కూడా ఏర్పడబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. ఇంకా రెండు రాశుల వారికి ఊహించని సమస్యలు, ఆర్థిక నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరి, అస్సలు లేట్ చేయకుండా ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కుంభ రాశి : శని, చంద్రుల సంయోగం వల్ల వీరికి కష్టాలు ఎక్కువుతాయి. అదే విధంగా ఉద్యోగ మార్పులు జరుగుతాయి. ఇంకా మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ మానసిక ప్రశాంతత కూడా పోతోంది. వ్యక్తిగత జీవితంలో కూడా మీ భాగస్వామితో గొడవలు అవుతాయి.

మీన రాశి : ఈ రాశి వారికి మానసిక ఆందోళన ఇంకా బాగా పెరుగుతుంది. ఆఫీసులో పనిభారం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి నష్టాలు వస్తాయి. ఇంకా వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో అపార్థాలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో కొత్త రుణాలు తీసుకోకండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.