Vizag Zoo: జూ లో తిరగలేక పోయే వారికి గుడ్ న్యూస్.. కొత్త ప్రయోగానికి శ్రీకారం.. ఎక్కడంటే..

Edited By:

Updated on: Feb 23, 2024 | 8:49 PM

సరదాగా జూకు వచ్చే సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాటరీ సైకిళ్లను ప్రారంభించింది. సందర్శకులకు ఆ సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.అధునాతన సాంకేతికత గల ఈ బ్యాటరీ సైకిళ్లు సందర్శకులకు జూలోని వివిధ జంతువులను ఓపికగా చూడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. జూ చాలా విశాలంగా ఉండడంతో పాటు అన్ని జంతువులను చూడడానికి నడుచుకుంటూ తిరగాలంటే ఒక్కోసారి శక్తి ఉండక పోవచ్చు. అలా అని కార్‎లో తిరగాలి అంటే అదనంగా డబ్బులు కట్టాలి.

1 / 5
సరదాగా జూకు వచ్చే సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాటరీ సైకిళ్లను ప్రారంభించింది. సందర్శకులకు ఆ సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

2 / 5
అధునాతన సాంకేతికత గల ఈ బ్యాటరీ సైకిళ్లు సందర్శకులకు జూలోని వివిధ జంతువులను ఓపికగా చూడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. జూ చాలా విశాలంగా ఉండడంతో పాటు అన్ని జంతువులను చూడడానికి నడుచుకుంటూ తిరగాలంటే ఒక్కోసారి శక్తి ఉండక పోవచ్చు. అలా అని కార్‎లో తిరగాలి అంటే అదనంగా డబ్బులు కట్టాలి.

3 / 5
అయినా కార్‎లో తిరిగితే జూలో జంతువులన్నింటిని చూసిన ఫీలింగ్ కూడా రాదు. అందుకే ఈ బ్యాటరీ సైకిళ్ళు అయితే మనకు కావాల్సినంత సేపు వాడుకోవచ్చు. కేవలం మామూలు రవాణాకు మాత్రమే కాదు పర్యావరణ అనుకూలమైన రవాణా సౌకర్యాన్ని అందించడానికి కూడా అనుకూలతలతో రూపొందించబడ్డాయి.

4 / 5
ఈ బ్యాటరీ సైకిళ్లు పర్యాటకులకు మరింత ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. పర్యాటకులు ఎక్కువగా అలసిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అంతే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడంలో వైజాగ్ జూ అంకితభావాన్ని కూడా తెలియజేస్తుంది. కలకత్తా - చెన్నై జాతీయ రహదారి పై ఉన్న జూ మెయిన్ గేట్ మరియు సాగర్ గేట్ వద్ద ఈ బ్యాటరీ సైకిళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

5 / 5
అయితే వీటి నిర్వహణ కోసం సందర్శకులు గంటకు 70 రూపాయలు చొప్పున చెల్లించి అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని రైడ్ చేస్తూ కాలుష్యం మరియు ఎటువంటి శబ్దం లేకుండా వైజాగ్ జూ లోని వివిధ జంతువులను చూస్తూ ఆనందించవచ్చంటున్నారు జూ అధికారులు.