uppula Raju |
Sep 08, 2021 | 3:53 PM
చెట్లు లేకుండా మానవ జీవితాన్ని ఊహించలేము. ఎందుకంటే అవి మనుషుల కోసం ఆక్సిజన్, పండ్లు, అందిస్తాయి. నిజంగా చెప్పాలంటే మానవుల జీవితం పూర్తిగా మొక్కలపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎత్తైన చెట్టు గురించి మీకు తెలుసా.. ఇది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పొడవుగా ఉంటుంది.
ప్రపంచంలో అతి ఎత్తైన చెట్టు 'హైపేరియన్'. ఇది రెడ్‌ఉడ్ జాతిది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో రెడ్ ఉడ్ నేషనల్ పార్క్‌లో ఉందిది. ఇది 35 అంతస్తుల భవనం కంటే ఎక్కువ ఎత్తుంటుంది.
హైపేరియన్‌ని 2006 సంవత్సరంలో కనుగొన్నారు. ఈ చెట్టు ఎత్తు 115.85 మీటర్లు. ప్రపంచంలోనే ఎత్తైన వృక్షం కావడంతో దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. ఈ చెట్టు రెడ్‌వుడ్ నేషనల్ పార్క్, కాలిఫోర్నియాలో ఉంది.
అమెరికా కాకుండా ఈ చెట్ల జాతులు న్యూజిలాండ్, బ్రిటన్, ఇటలీ, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మధ్య మెక్సికో, ఆగ్నేయ అమెరికాలో కనిపిస్తాయి. ఇవి మరింత వర్షాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతాయి.