Fireflies: మిణుగురులు రాత్రి పూట ఎందుకు ప్రకాశిస్తాయి.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే….

|

Apr 06, 2021 | 10:06 PM

రాత్రి చీకటిలో మిణుగురులు మెరుస్తూ ఎగురుతుండటం చూసి అందరి హృదయం పులకరిస్తుంది. అసలు మిణుగరు పురుగులు రాత్రి ఎందుకు మెరుస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు దాని వెనుక ఉన్న రహస్యాన్ని మీకు తెలియజేస్తాం.

1 / 5
గ్రామాలలో, చిన్న పట్టణాలలో రాత్రిపూట మిణుగురులు మెరుస్తూ ఉండడాన్ని మీరు చూసే ఉంటారు. ఆ దృశ్యం కంటికి ఇంపుగా ఉంటుంది. కానీ ఇది చూసిన తరువాత, రాత్రిపూట మిణుగురులు ఎందుకు మెరుస్తున్నాయో అనే ప్రశ్న మీ మనసులో మోగుతుంది. దాని గురించి ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాం.

2 / 5
వాటి మెరుపుకు ప్రధాన కారణం ఆడ మిణుగురులను ఆకర్షించడం. మిణుగురు పురుగుల గుడ్లు కూడా మెరుస్తాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవి ప్రధానంగా మూడు రకాల రంగులలో మెరుస్తాయి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు.

3 / 5
ఈ కీటకం యొక్క మగ, ఆడ ఇద్దరి భౌతిక నిర్మాణంలో ప్రత్యేకమైన వ్యత్యాసం ఉంది. ఆడ తుమ్మెదలకు రెక్కలు ఉండవు. కాబట్టి అవి ఒకే చోట మెరుస్తాయి. మగ తుమ్మెదలకు రెండు రెక్కలు ఉంటాయి.  కాబట్టి అవి ఎగురుతూ ప్రకాశిస్తాయి.

4 / 5
మిణుగురులు మన దేశంలో చాలా ఉన్నప్పటికీ, మెరిసే తుమ్మెదలు ఎక్కువగా వెస్టిండీస్,  దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. ఈ కీటకాన్ని 1667 లో రాబర్ట్ బీల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.

5 / 5
మొదట్లో ప్రజలు మిణుగురుల శరీరంలో భాస్వరం ఉందని అనుకునేవారు. అందుకే అవి ప్రకాశిస్తాయని భావించేవారు.  కాని 1794 లో మిణుగురులు మెరుస్తున్నది భాస్వరం వల్ల కాదు. లూసిఫేరేస్ అనే ప్రోటీన్ల వల్ల నిర్ధారణ అయ్యింది.