
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం.కొల్లూరు మండలం ఈపూర్ లంక గ్రామస్తులు గోమాత కి శ్రీమంతం నిర్వహించారు.

హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాత లో మూడు కోట్ల దేవతలు ఉంటారని

గోవును పూజించడం వలన గ్రామానికి మంచి జరుగుతుందని గోమాతకు తొమ్మిదో నెల వచ్చిన సందర్భంగా శ్రీమంతం నిర్వహిస్తున్నామన్నారు

ఈ రోజు ఏకాదశి కార్తీక సోమవారం మంచి రోజున గోమాతకు శ్రీమంతం చేయటం మంచి శుభపరిణామమని గ్రామస్తులు అన్నారు

గోమాతకు ఫలహారాలు తో పాటు పూలు, గాజులు, చీర, గోమాతకు అందించి

గోమాతను పూజించి నైవేద్యం సమర్పించి గ్రామానికి మంచి జరగాలని గ్రామస్తులు అందరూ కలిసి శ్రీమంత వేడుకల్లో పాల్గొన్నారు

గ్రామంలో ఒక వర్గం అత్తింటివారి గా ఒక వర్గం పుట్టింటివారు గా విభజించుకుని శ్రీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్ అవుతున్నాయి...

ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్ అవుతున్నాయి...