Venkata Narayana |
Apr 18, 2021 | 2:37 PM
ఇరాన్ తీరప్రాంత నగరమైన బందర్ గెనావే సమీపంలో ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.
జపాన్‌లోనూ ఇవాళ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైందని జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
జపాన్ మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ భూకంపం సంభవించింది.
ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. సునామీగా మారే అవకాశం లేదని అధికారులు తెలిపారు.