Istanbul NASA Photos: ఈ విశ్వం ఎన్నో వింతలకు మరెన్నో అద్భుతాలకు నెలవు. మరీ ముఖ్యంగా టెక్నాలజీ కారణంగా రోజురోజుకూ అత్యంత వేతంగా మారుతోన్న భూగ్రహంపై చోటుచేసుకునే పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఆకాశం నుంచి చూస్తే ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తాజాగా టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ పట్టణం ఫొటోను పంపించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజెన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపై ఉన్న ఇస్తాంబుల్ పట్టణాన్ని తీసిన ఫొటోను నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో రాత్రి పూట జిగేల్ మంటూ కనిపిస్తోన్న ఇస్తాంబుల్ పట్టణం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోను నాసా పోస్ట్ చేస్తూ… `హే ఇస్తాంబుల్ నువ్వు వెలిగిపోతున్నావు. ఈ ఫొటోను మే 10, 2021 నాడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తీసింది` అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక నాసా అప్పుడప్పుడు అంతరిక్షం నుంచి భూమిని ఫొటోలు తీయడానికి గల కారణాన్ని వివరిస్తూ.. `నాసా వ్యోమగాములు ఇలాంటి చిత్రాలను కేవలం భూమిపై అందమైన ప్రదేశాలను చూపించడం కోసమే విడుదల చేయరు. దీంట్లో సైన్స్ కూడా దాగి ఉంది. ఈ ఫొటోల ఆధారంగా భూ గ్రహం ఎలా మారుతుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పట్టణీకరణ, ఆనకట్టల నిర్మాణాలు, సహజ సిద్ధమైన ప్రమాదాలైన లావా, వరదలు భూమిని ఎలా మార్పులను లోను చేస్తున్నాయన్న దానిపై ఒక స్పష్టత వస్తుంది` అంటూ ఈ ఫొటోల వెనక ఉన్న అసలు లక్ష్యాన్ని చెప్పుకొచ్చింది నాసా.
Also Read: Big Bang: విశ్వం పుట్టుక గురించి సరికొత్త విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
Rahul gandhi: కరోనా మరణాలపై కేంద్రం చెబుతున్నది పచ్చి అబద్ధం.. రాహుల్ గాంధీ ఆరోపణ
Honda Bike: హోండా నుంచి విడుదల కానున్న మరో సరికొత్త బైక్.. అత్యాధునిక ఫీచర్లతో బైక్ తయారీ