
మరో 24 గంటల్లో వినాయకుడి పూజలు అందుకోనున్నాడు. ఇక ఈ సమయంలో నైవేద్యాలు, అన్నదానం వంటివి చేస్తుంటారు. వినాయకుడి అన్నదానంలో మీరు పప్పు, బంగాళాదుంప కూరలు ఇలా చిట్కాలను పాటిస్తే 500 మందికి పెట్టొచ్చు. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు: 18 కిలోలు కందిపప్పు , 10 కిలోలు టమాటాలు, 8 కిలోలు ఉల్లిపాయలు, 3 కేజీలు పచ్చిమిర్చి, పావుకిలో పసుపు, 800 గ్రాములు కారం , మూడు కేజీలు ఉప్పు, రెండు కేజీలు చింతపండు, రెండు కేజీలు కొత్తిమీర ,కేజీ కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తాలింపుకు, మూడు లీటర్లు నూనెను తీసుకోవాలి.

టమాటా పప్పు తయారీ విధానం: ముందుగా కందిపప్పును తీసుకుని బాగా కడిగి కొంతసేపు దీనిని నానబెట్టి పెద్ద పెద్ద పాత్రల్లో ఉడికించాలి. ఇక ఇప్పుడు పెద్ద కళాయి ఆయిల్ వేసి బాగా వేడి చేసి దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.నాలుగు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి కూడా టమాటాలు కలపాలి ఇవి మెత్తగా అయినా తరువాత పసుపు, కారం వేసి ఉడికించిన పప్పు, చింతపండు రసం, ఉప్పు వేసి ఒకటికి మూడు సార్లు బాగా తిప్పి పోపు వేయాలి.

బంగాళాదుంప కూరకు కావాల్సిన పదార్థాలు: 50 కేజీలు బంగాళాదుంపలు, 9 కిలోలు ఉల్లిపాయలు, 3 కేజీలు పచ్చిమిర్చి, ఒక కిలో కారం, 250 గ్రాములు పసుపు , 3 కేజీలు ఉప్పు , అరకిలో ఆవాలు, 400 గ్రాములు జీలకర్ర, ఒక కిలో కరివేపాకు, 5 కిలో మీటర్లు, రెండు కేజీలు కొత్తిమీర, రెండు కేజీలు కరివేపాకు ను తీసుకోవాలి.

తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను తీసుకుని బాగా ఉడికించి దాని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తరువాత ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. పచ్చిమిర్చి వేసి వేయించాలి. పసుపు, కారం, ఉప్పు వేసి దుంపలకు మసాలా పట్టేలా దీనిని కలపాలి.