దసరా రోజు జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారు.. దీని వెనక రహస్యం తెలుసా?

Updated on: Oct 14, 2026 | 8:43 AM

దసరా పండుగ వచ్చేస్తోంది. ఈ సమయంలో రావణ దహనం మాత్రమే కాకుండా, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించి, ఆ ఆకులను పంచుకుంటారు. అయితే ప్రతి ఒక్కరూ హిందువులు అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. కాగా, ఈ సమయంలో జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? ప్రతి ఒక్కరూ దీనిని ఎందుకు బంగారంగా భావించి పంచుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
విజయ దశమి రోజు శమీ పూజ తర్వాత ప్రతి ఒక్కరూ జమ్మి ఆకులను తీసుకొని తమకు ప్రియమైన వారికి ఇచ్చి పాదాలను తాకి ఆశీర్వాదం పొందుతారు. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ జమ్మి ఆకులను తమ ప్రియమైన వారికి ఇస్తుంటారు. మరి అసలు జమ్మి చెట్టు ఆకులను ఎందుకు ఈ ప్రియమైన వారికి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
జమ్మి ఆకులను  పంచుకోవడం వెనుక ఉన్న పౌరాణిక కథలు, జానపద కథలు కూడా ఉన్నాయంట. ముఖ్యంగా మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ తమ ఆయుధాలన్నింటినీ ఒక జమ్మి చెట్టు మీద దాచిపెట్టారు. 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత విజయదశమి రోజు తిరిగి వచ్చి ఆ చెట్టు మీద ఆయుధాలు తీసుకొని శమీ పూజ చేశారంట. తర్వాత కౌరవులపై యుద్ధానికి వెల్లి గెలిచారు. అందువలన విజయానికి గుర్తుగా జమ్మి చెట్టును పూజించి, ఆకులను పంచుకుంటారంట.

3 / 5
మరో కథనం ప్రకారం, లంకాధిపతి అయిన రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు జమ్మి చెట్టును పూజించాడంట. తర్వాత రావణుడి మీదకు యుద్ధానికి వెళ్లి , ఆయనను సంహరించి, సీతమ్మ తల్లితో అయోధ్యకు తిరిగి వచ్చాడంట. ఆ తర్వాత బంగారు నాణేలను పంపిణీ చేశారు. దానికి చిహ్నంగానే విజయ దశమి రోజు జమ్మి చెట్టును పూజించి, దానిని పంచుకుంటారు అని కొందరు పండితులు చెబుతున్నారు.

4 / 5
అంతే కాకుండా విజయదశమి రోజు ఈ జమ్మి ఆకులను పూజించడం, వాటిని పంచుకోవడం చాలా మంచిదంట. దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నదంట. అంతే కాకుండా మత విశ్వాసం ప్రకారం, దసరా రోజున శమీ ఆకులను పంచుకోవడం వలన సంతోషం, అదృష్టం పెరిగి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందంట.  అంతే కాకుండా శమీ ఆకులను పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది. అంతే కాకుండా జీవితంలో గొప్ప పురోగతి ఉంటుందంట.

5 / 5
ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us