
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

జ్యోతిషశాస్త్రంలో షడాష్టక యోగం ఎంతో ముఖ్యమైనది. ఇంకా శుక్ర, శని గ్రహాలు కలవడం వలన ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల రెండు రాశుల వారికి ఊహించని విజయాలు దక్కనున్నాయి. ఆర్ధికంగా కూడా వీరికి కలిసి రానుంది. ఇంకా వీళ్ళు ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు.

శుక్ర, శని గ్రహాల కలయిక కారణంగా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతోంది. ఇంకా జీవితం నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, విలాసాలు కూడా పెరుగుతాయి. అలాగే వీరి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. వీరి మధ్య ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఇంకా ఉద్యోగం చేసే చోట గుర్తింపు పొందుతారు. ఇంకా పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

షడాష్టక యోగం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఇంకా వ్యాపారాలు చేస్తున్న వారికి అధిక లాభాలు వస్తాయి. అలాగే, పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. సమాజంలో వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. పెద్ద పరిచయాల వలన జీవితం మారుతుంది వారితో సంబంధాలు పెరుగుతాయి. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.