
మష్రూమ్ ములక్కాయ కూరను ఎలా వండాలంటే .. ముందుగా మష్రూమ్స్‌ని కడిగి క్లీన్ చేసి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ములక్కాయలను కూడా నీళ్ళతో కడిగి ముక్కలుగా చేసుకుని పాత్రలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి అది వేడయ్యాక, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వాటిని బాగా వేగించాలి.

ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు టొమాటో ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఆ నూనె పైకి తేలే వరకు వాటిని బాగా వేయించాలి.

ఇక ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వాటిని నీరు వచ్చే వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మునక్కాడ ముక్కలు కూడా దానిలో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు వాటిని ఉడికించాలి.

చివర్లో కొత్తిమీరను కూడా వేసి కొద్దీ సేపు ఉడికించి ఈ కూరలో బాదం పప్పులు కూడా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మట్టి పాత్రలో ఈ కూరను చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.