
పసుపు రంగు పూలలో, ముళ్లతో ఉండే వ్రజ దంతి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయంట. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. కాగా ఈ మొక్క వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

వజ్ర దంతి, దంత సమస్యలకు చాలా మంచిది. ఈ మూలికను ఆయుర్వేదంలో నోటి ఆరోగ్యం, దంత సంరక్షణ, చిగుళ్ల బలోపేతానికి ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా నోటి పూతను తగ్గించడంలో కూడా ఇది కీలకంగా పని చేస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా మంది చిగుళ్ల సమస్యకు ఈ మూలికను ఉపయోగిస్తుంటారు.

ఇక ఈ వజ్ర దంతి మూలికలో అనేక యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయంట. అందువలన దీనిని పిప్పి పన్ను సమస్యతో బాధపడే వారు, ఈ ఆకు రసాన్ని పిప్పి పన్ను వద్ద పోయడం వలన ఇది ఆ సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట. అంతే కాకుండా , దీని ఆకులు నమలడం వలన చిగుళ్ల సమస్యలు వెంటనే తగ్గిపోతాయంట.

చాలా మంది ఈ మొక్క కేవలం దంత సమస్యలకే దివ్యౌషధం అనుకుంటారు. కానీ ఇది అనేక సమస్యలను తరిమికొట్టే ఆయుధంగా పని చేస్తుందంట. ఈ మొక్క పూలు, ఆకులు, వేర్లు, అన్నింటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఎవరు అయితే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారో, వారు ఈ ఆకుల రసాన్ని నొప్పుల చోట రాయడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయంట.

అదే విధంగా చర్మం, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సమస్యలతో బాధపడే వారు, దీనిని తీసుకోవడం చాలా మంచిదంట. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి, కాలేయ పనితీరును మెరుగు పరచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందంట. అందుకే చాలా మంది దీనిని ఉపయోగిస్తుంటారు.