
జిడ్డుగల జుట్టు: జిడ్డు గల జుట్టుతో ఇబ్బంది పడుతున్న వారికి ఉప్పు నీరు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. మీ జుట్టును ఉప్పు నీటితో కడగడం లేదంటే, మీరు వాడే షాంపూలో ఉప్పు కలపడం వల్ల మీరు జిడ్డుగల జుట్టు సమస్యను వదిలించుకోగలరు. అలాగే, చర్మంపై మృతకణాలను కూడా తొలగిస్తుంది. చర్మంపై నూనె గ్రంథుల సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో ఉప్పు సహాయపడుతుంది. దీని వల్ల జుట్టులో జిడ్డు గుణాన్ని తగ్గిస్తుంది.

జుట్టు రాలడం: జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఉప్పు నీరు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఉప్పుతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉప్పును తలకు రాసుకుంటే తలపై పేరుకున్న మురికి శుభ్రపడి, శిరోజాల రంధ్రాలు కూడా సులభంగా తెరుచుకుంటాయి. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తుంది.

చుండ్రు సమస్యకు చెక్: ఉప్పులో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి మీ తల, తలలోని వెంట్రుకలను కుదుళ్ల నుంచి శుభ్రపరుస్తాయి. దానిలోని అదనపు ఆయిల్ ని తగ్గిస్తాయి. దీని వల్ల చుండ్రు సమస్య క్రమంగా దూరమవుతుంది. జిడ్డు జుట్టు సమస్య దూరం జుట్టులో స్నిగ్ధత ఎక్కువగా ఉంటే, ఉప్పు నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టులో ఉన్న అదనపు జిడ్డు తొలగిపోతుంది.

స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు వేసుకుని చేయటం వల్ల శరీరంలో వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనలో రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఇది బ్యాక్టీరియా క్రిములను దూరంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఉప్పులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఉప్పును స్నానం చేసే నీటిలో కలుపుకోవడం వల్ల శరీరంపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.

అంతేకాదు ఇందులో ఉండే ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. మృదువుగా మారి చర్మం నునుపుగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇలా తరచూ ఉప్పు నీటితో స్నానం చేస్తే ముఖంపై ముడతలు కూడా తొలగిపోతాయి.