Tourism: ఎకో టూరిజం హాట్ స్పాట్.. అద్బుతమైన అందాలతో ప్రకృతిలో దాగివున్న రహస్య ప్రదేశం.. ఎక్కడో తెలుసా..?

|

Jan 12, 2023 | 8:30 PM

నిజానికి, ఈ ప్రదేశం ఉత్తర ప్రదేశ్‌లోని చందౌలీలో ఉంది., దీనిని రాజదారి దేవదారి జలపాతం అని కూడా పిలుస్తారు. పర్వతం నుండి పడుతున్న జలధార, దాని చుట్టూ ఉన్న పచ్చదనం దృశ్యాలను చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడి ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఎకో-టూరిజం హాట్ స్పాట్‌గా సిద్ధం చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి..

1 / 5
యూపీలో ప్రకృతి అందాలకు అద్దం పట్టే ఓ ప్రదేశం ఉంది. ప్రకృతిలో దాగివున్న ఈ రహస్య ప్రదేశం ఇప్పుడు ప్రభుత్వంచే ఎకో-టూరిజం హాట్ స్పాట్‌గా మారబోతోంది.. ఇక్కడి జలపాతం, పచ్చని పర్వతాలు, ప్రవహించే నీటి అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి.

2 / 5
చందౌలీ DM ఈ ప్రదేశాన్ని ఎకో-టూరిజం హాట్ స్పాట్‌గా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వం నుండి రూ. 2 కోట్ల డిమాండ్ చేశారు.

3 / 5
ఈ ప్రదేశం అసలు పేరు ఔర్వతండ్.. ఇది రాజ్దారి-దియోదరి జలపాతాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకాలం సరైన నిర్వహణ లేకపోవడం కారణంగా ఇలాంటి ప్రకృతి అందాల నిధి ఏళ్ల తరబడి అడవుల్లోనే దాగిపోయింది. పర్వతాలు,పచ్చని చెట్లతో నిండిపోయిన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా మారనుంది.

4 / 5
ఔర్వతాండ్ సహజమైన లోయతో ఏర్పడి ఉంది. ఇది దాని ప్రత్యేకతను కలిగి ఉందని DM చెప్పారు.  రాక్ క్లైంబింగ్ సహా టైర్ నెట్ వాల్ వంటి అనేక సాహస క్రీడలను కూడా ఇక్కడ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

5 / 5
ఇది కాకుండా, ఎకో-టూరిజం హాట్ స్పాట్ ప్రధాన ద్వారం వద్ద స్థానిక రాళ్ళు, వెదురుతో దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.  ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు పార్కింగ్‌, టాయిలెట్‌ ఇతర అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.