
చాలా మంది గుమ్మడికాయలతోనే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ వీటి పువ్వులతో కూడా కర్రీ ప్రిపేర్ చేసి తినడం వలన ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఈ పువ్వులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయంట. అందువలన వీటిని మీ ఆహారంలో చేర్చుకున్నా ఊహించని ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

గుమ్మడి పువ్వులలో విటమిన్స్, ఖనిజాలు, నీరు, ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి వంటి వాటితో పాటు ఫోలేట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంతే కాకుండా ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉండటం వలన దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ఇది మిమ్మల్ని అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

గుమ్మడి పువ్వులలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వలన ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుమ్మడి పువ్వులను మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది కంటి చూపును మెరుగు పరిచి, కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అంతే కాకుండా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ మొతాదులో ఉంటుంది. అందువలన ఈ కర్రీని తినడం వలన ఇది కడుపు సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పేగు కదలికలు సక్రమంగా జరిగి, ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంపొందించడానికి సహాయపడుతుంది.

అంతే కాకుండా గుమ్మడి పువ్వును మీ ఆహారంలో చేర్చుకొని తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి మేలు చేస్తోంది.