
నార్మల్‌గానే ఐఫోన్ చాలా ఖరీదైనవి.. ఇక వాటిలో ఎక్కవ స్టోరేజ్ ఉన్న కొనాలంటే వాచిపోతుంది. చాలా మంది ఐఫోన్ వాడాలన్న కోరికతో 126, 250gb స్టోరేజ్ ఉన్న ఫోన్స్‌ను కొంటారు. కానీ ఫోన్ కొన్న కొన్ని రోజులకే హై రిజర్వేషన్ ఫొటోస్, వీడియోస్ కారణంగా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఫోన్ స్టోరేజ్ నుండి పదే పదే "iPhone storage full" అనే మెసేజ్ వస్తుంది. ఇది చాలా మందికి చిరాకు తెప్పిస్తుంది.

ఈ చిరాకు తగ్గించుకోవాలంటే ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుంది. లేదా సపరేట్‌గా దొరికే ఐఫోన్ క్లౌడ్ స్టోరేజ్‌ను కొని అందులో మీ ఫోటోస్, వీడియోను దాచుకోవాలి. అందుకే ఐఫోన్ కొనడం కన్నా.. దాన్ని మెయింటేన్ చేయడమే పెద్ద సమస్య అనుకుంటారు జనాలు. మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అంటే.. ఉంది కొన్ని ట్రిక్స్ వాడి మీరు అన్లిమిటెడ్ ఫ్రీ ఐ క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చు. అవును ఈ ట్రిక్ వాడితే ఇంక మీ ఫోటోలను వీడియోలను ఎప్పటికీ డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఇందుకోసం సింపుల్ గా మీ ఐఫోన్‌లో ఉన్న ఫొటోస్ యాప్ ఓపెన్ చేయండి. అందులో ఉన్న కలెక్షన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అందులో ఆల్బమ్స్ ని కిందకు స్క్రోల్ చేస్తే shared albums అనే యాక్టివిటీ కనిపిస్తుంది. అందులో + ప్లస్ అని బటన్ క్లిక్ చేసి కొత్త ఆల్బమ్ క్రియేట్ చేయండి. మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ ను ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఆల్బమ్ లోకి యాడ్ చేయండి. ఇలా ఒక్క ఆపిల్ ఐడితో 200 షేర్డ్ ఆల్బమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్క ఆల్బమ్‌లో 5000 ఫోటోలని స్టోర్ చేయొచ్చు.

ఇది మీ ఫోన్లో ఉన్న స్టోరేజ్ లో కానీ, ఐ క్లౌడ్ స్టోరేజ్ లో కానీ సేవ్ అవ్వదు. డైరెక్ట్ గా ఆపిల్ సర్వర్లో స్టోర్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా మీ ఫోటోలు కూడా భద్రంగా ఉంటాయి. కానీ ఇక్కడో సమస్య ఉంది మీ ఫోటోలు మీరు తీసిన రిజల్యూషన్‌లో కాకుండా తక్కువ క్వాలిటీతో సేవ్ అవుతాయి. అంటే మరీ తక్కువే కాదు.. డీసెంట్ క్వాలిటీలోనే ఉంటాయి.

మొత్తం ఫోటోలను ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం కంటే ఇది చాలా బెటర్ కదా. ఇంకెందుకు లేటు వెంటనే ఈ ట్రిక్ ఉపయోగించి మీ ఫోటోస్, అండ్ వీడియోస్‌ను దాచుకోండి. మీ ఐఫోన్ ఫ్రెండ్స్‌కు ఈ ఆర్టికల్‌ను షేర్ చేయండి.