
ఫిబ్రవరి ముగిసి మార్చి అలా ఎంటరైందో లేదో సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఎండలు అప్పుడే దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా ఉంటున్నాయి. వేసవి కాలంలో ఏసీ కంపెనీలు కూడా తమ ప్రోడక్ట్స్ ధరలను పెంచుతున్నాయి. అయితే, గత కొన్ని సంవత్సరాల నుండి భారతదేశంలో రూ. 25 వేల లోపు స్ప్లిట్ AC లకు డిమాండ్ బాగా పెరిగింది.

రూ. 25 వేల లోపు స్ప్లిట్ ఏసీ కొంటే దాని పనితీరుపై పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా వరకు కస్టమర్స్ వీటి పనితీరు బాగుందనే చెబుతున్నారు. మార్కెట్‌లో చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న స్ప్లిట్ ఏసీలు ఉన్నాయి. రూ. 25 వేల లోపు కొన్ని స్ప్లిట్ ఏసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బిలియన్ AC145 : బిలియన్ కంపెనీ నుంచి 1.5 టన్ను AC ధర కేవలం రూ. 21,999. ఈ త్రీ స్టార్ రేట్ స్ప్లిట్ AC పూర్తి మోడల్ నేమ్ బిలియన్ AC145 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్. రిమోట్ సహాయంతో ఈ ఏసీని కంట్రోల్ చేయవచ్చు. ఈ ఎయిర్ కండీషనర్ డస్ట్, ఫిల్టర్లను కలిగి ఉంటుంది. ఈ AC ప్రధాన, బాహ్య యూనిట్ కండెన్సర్ కాయిల్స్ అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి.

డైకిన్ 0.8 టన్ స్ప్లిట్ ఏసీ: 3 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఏసీ రూ.25 వేల లోపు లభిస్తుంది. ఇందులో స్లీప్ మోడ్‌తో సహా మరిన్ని ఫీచర్లు అందించబడ్డాయి. రూ.24,649 లకే ఈ ఏసీని కొనుగోలు చేయవచ్చు.

MarQ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC: మీరు ఈ AC మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 21,490కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2020లో ప్రారంభించబడింది. ఈ మోడల్ మార్కెట్లో 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. అలాగే మీరు కాపర్ కండెన్సర్ మాత్రమే పొందుతారు. ఇందులో ఆటో రీస్టార్ట్ సదుపాయం కూడా ఉంది.

Voltas SAC 122 Cya: ఈ 1 టన్ను వోల్టాస్ ఎయిర్ కండీషనర్ ధర కేవలం రూ. 20,740. ఈ 2 స్టార్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్.. ఈ AC ప్రధాన, బాహ్య యూనిట్ కండెన్సర్ కాయిల్స్ రాగితో తయారు చేయబడ్డాయి. ఈ స్ప్లిట్ AC 1 సంవత్సరం ప్రోడక్ట్ వారంటీ, 5 సంవత్సరాల కంప్రెసర్ వారంటీతో వస్తుంది.

వర్ల్‌పూల్ 1 టన్ స్ప్లిట్ AC: 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఆటో రీస్టార్ట్, స్లీప్ మోడ్, టర్బో కూల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే ఇందులో ఆర్32 గ్యాస్‌ను కూడా వాడారు. ఈ AC 1 సంవత్సరం వారంటీ, 5 సంవత్సరాల కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఈ ఏసీ ధర రూ.24,999.