
ప్రస్తుత కాలంలో అందరూ కంప్లైట్ చేసే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలకుండా అనేక రకాల హోమ్ మేడ్ చిట్కాలు, బయట మార్కెట్లో లభించే షాంపూలు, ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మీ జుట్టుకు ముందు ఏది అవసరమో అది తెలుసుకోవాలి. అందుకు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి.

అల్లం నేలలో పెరుగుతుంది కాబట్టి. దానిని బాగా కడగాలి. ఇలా పొట్టుని తీయడానికి సాధారణంగా చేతి గోళ్లనే ఎక్కువగా వినియోగిస్తుంటాం. లేదంటే చెంచాతో. అయితే కాసేపు నీళ్లలో నానబెట్టి ఉంచితే అల్లం సులువుగా ఒలిచిపోతుంది.

తరచుగా అల్లం రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మెత్తగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు మెరుస్తూ ఉంటుంది. అల్లం రసాన్ని కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్స్‌తో కలిపి రాయవచ్చు. ఓ గంట పాటు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటుంది.

అల్లంలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. తద్వారా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది. అల్లంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

అల్లం కూడా ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల మీ జుట్టు మెత్తగా, మెరుస్తూ ఉంటుంది. వారానికి ఒకసారి అయినా ఇలా ట్రై చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)