
ముచ్చింతల్‌లోని రామానుజ విగ్రహం, సమతా స్ఫూర్తిని చాటుతున్న తీరును విశదీకరించారు. ఈ దివ్యభవ్య కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతానని చిన్నజీయర్ స్వామీజీతో చెప్పడంతో భద్రతా ఏర్పాట్లను చేపట్టారు పోలీసు ఉన్నతాధికారులు.

శంషాబాద్ మండలం ముచింతల్‌లో 20వ తేదీ నుండి 3మార్చి వరకు భగవద్ రామానుజుల "సమతా కుంభ్-2024" నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి రావలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, జీయర్ సంస్థల ముఖ్యులు ఎర్నేని రామారావులు కలసి ఆహ్వానించారు.

సమతా కుంభ్ 2024 మహోత్సవాలకు విచ్చేయవలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్. ఈ సందర్భంగా ఫిబ్రవరి 19న ఉదయం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు స్వామీజీ. ముఖ్యమంత్రికి మంగళాశాసనాలు అందించారు.

శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలకు విచ్చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. జగదాచార్యులైన భగవత్ రామానుజుల జీవిత విశేషాలను ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి రామానుజుల దివ్య మూర్తిని దర్శించుకుంటామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాం అందించారు త్రిదండి చిన్నజీయర్. దానికంటే ముందు స్వామీజీని సీఎం రేవంత్ మర్యాదకపూర్వకంగా స్వాగతం పలికారు. ఆ తరువాత కాసేపు ఆధ్యాత్మిక తత్వంతో ముచ్చటించుకున్నారు.