
ఓఖ్లా పక్షుల అభయారణ్యం ప్రజలను ఆకర్షిస్తుంది. ఇక్కడ చాలా విదేశీ పక్షులు వలస వస్తాయి. పక్షులను చూడటానికి ఇష్టపడే వారికి ఈ ప్రదేశం ఉత్తమమైంది. అయితే, శీతాకాలంలో ఇక్కడ పర్యటించడం మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది.

నోయిడా ప్రధాన పర్యాటక ఆకర్షణల ప్రాంతాల్లో ఒకటి ఓఖ్లా పక్షుల అభయారణ్యం. 319 అరుదైన జాతుల పక్షులు ఉండే ఈ అభయారణ్యాన్ని పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం.

చలికాలంలో దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పక్షులు ఓఖ్లా బర్డ్ శాంక్చురీకి చేరుకుంటాయని నమ్ముతారు. ఈ పక్షులు అక్టోబరు మధ్యలో రావడం ప్రారంభించి, మార్చిలోగా వెళ్లిపోతాయని చెబుతారు.

విశేషమేమిటంటే ఇక్కడ పక్షులు కూర్చునేందుకు వెదురు నాటడంతో పాటు సరస్సును శుభ్రం చేశారు. నల్లపాముల గద్ద, కింగ్ ఫిషర్, చిన్న నల్లకంప జిట్ట, పచ్చ జీనువాయి వంటి అనేక రకాల పక్షులను ఇక్కడ సందర్శించవచ్చు.

ఈ వలస పక్షులను సంరక్షించడానికి 1990 లో ఈ స్థలాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. అప్పటి నుండి పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో ఇది ఒకటి. 2020-21లో ఇక్కడ 16 వేల 61 పక్షులు ఉన్నాయని గుర్తించారు. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఇక్కడ వందలాది పక్షుల మధ్య గడపడానికి ఇష్టపడతారు.

టిబెట్, యూరప్,సైబీరియాలలో నవంబరులో శీతాకాలం ప్రారంభమవ్వగానే ఇక్కడకి వచ్చి ఈ వెచ్చటి ప్రాంతం లో గడుపుతాయి. మరలా మార్చ్ లో వేసవి మొదలు కాగానే తిరిగి వెళ్ళిపోతాయి

మీరు కూడా ప్రత్యేక జాతుల పక్షులను చూడాలనుకుంటే, తప్పకుండా ఒకసారి ఇక్కడికి వెళ్లండి. చాలా అందమైన పక్షులు ఇక్కడ మిమ్మల్ని ఆకర్షిస్తాయి