భారతీయులైనా సరే మన దేశంలో ఈ ప్రదేశాలను సందర్శించాలంటే అనుమతి తప్పని సరి..

|

Oct 30, 2024 | 10:12 AM

ఏదైనా పని కోసం భారతదేశం నుండి మరేదైనా ఇతర దేశానికి వెళ్లాలనుకుంటే లేదా ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్నా.. అక్కడ అధికారిక నిబంధనల ప్రకారం వీసా పొందాలి. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలకు భారతీయులకు వెళ్ళడానికి వీసా అవసరం లేదు. అయితే మీరు భారతీయులైనప్పటికీ.. మన దేశంలో కొన్ని ప్రదేశాలను సందర్శించడానికి ఇన్నర్ లైన్ అనుమతి (ప్రభుత్వం జారీ చేసిన ఒక రకమైన అధికారిక ప్రయాణ పత్రం) అవసరం. అవును మన దేశంలో అనేక ప్రదేశాలకు అక్కడ ఉన్న అధికార యంత్రాంగం అనుమతి తప్పని సరి అని మీకు తెలుసా. ఈ రాష్ట్రాలకు చేరుకున్న తర్వాత అక్కడి పరిపాలన (పర్యాటక కార్యాలయం లేదా DC కార్యాలయం) నుంచి వ్రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో కూడా అనుమతి పొందవచ్చు.

1 / 7
భారతదేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విదేశీయులు మాత్రమే కాదు భారతీయులైనా సరే అక్కడ ప్రవేశించడానికి అనుమతి అవసరం. వీటిలో కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులతో అనుసంధానించబడి ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు సాంస్కృతిక వారసత్వం మొదలైన వాటిని సంరక్షించడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. కనుక ఈ రోజు భారతీయులైనా సరే అనుమతి తప్పని సరిగా తీసుకోవలసిన రాష్ట్రాల గురించి తెలుసుకుందాం..

భారతదేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విదేశీయులు మాత్రమే కాదు భారతీయులైనా సరే అక్కడ ప్రవేశించడానికి అనుమతి అవసరం. వీటిలో కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులతో అనుసంధానించబడి ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు సాంస్కృతిక వారసత్వం మొదలైన వాటిని సంరక్షించడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. కనుక ఈ రోజు భారతీయులైనా సరే అనుమతి తప్పని సరిగా తీసుకోవలసిన రాష్ట్రాల గురించి తెలుసుకుందాం..

2 / 7
అరుణాచల్ ప్రదేశ్
భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ దాని సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే.. భారతీయులైనా సరే ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. ఇక్కడ పర్వతాలు, అందమైన పచ్చని లోయలు, సరస్సులు, బౌద్ధ దేవాలయాలు మొదలైన ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు ఇక్కడ సందర్శించడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు వందలాది రకాల పక్షులను వీక్షించవచ్చు. అంతేకాదు ఇక్కడ మూడు పులుల అభయారణ్యాలు ఉన్నాయి, ఇక్కడ జంగిల్ సఫారీని ఆనందించవచ్చు.

అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ దాని సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే.. భారతీయులైనా సరే ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. ఇక్కడ పర్వతాలు, అందమైన పచ్చని లోయలు, సరస్సులు, బౌద్ధ దేవాలయాలు మొదలైన ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు ఇక్కడ సందర్శించడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు వందలాది రకాల పక్షులను వీక్షించవచ్చు. అంతేకాదు ఇక్కడ మూడు పులుల అభయారణ్యాలు ఉన్నాయి, ఇక్కడ జంగిల్ సఫారీని ఆనందించవచ్చు.

3 / 7
నాగాలాండ్
విదేశీయులే కాకుండా భారతీయులు కూడా సందర్శించడానికి అనుమతి అవసరమైన ప్రదేశాలలో భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం కూడా ఒకటి. అనేక తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో గొప్ప భాషా సంప్రదాయాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ అనేక రకాల పక్షులు ఉండటమే కాదు.. భౌగోళిక పరంగా కూడా ఈ ప్రదేశం మన దేశానికి చాలా ముఖ్యమైనది.

నాగాలాండ్ విదేశీయులే కాకుండా భారతీయులు కూడా సందర్శించడానికి అనుమతి అవసరమైన ప్రదేశాలలో భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం కూడా ఒకటి. అనేక తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో గొప్ప భాషా సంప్రదాయాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ అనేక రకాల పక్షులు ఉండటమే కాదు.. భౌగోళిక పరంగా కూడా ఈ ప్రదేశం మన దేశానికి చాలా ముఖ్యమైనది.

4 / 7
మిజోరం
నీలి పర్వతాల భూమిగా ప్రసిద్ధి చెందిన మిజోరాం భారతదేశంలో కూడా చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ యాత్రను ప్లాన్ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే భారతీయులకైనా సరే తప్పనిసరిగా అనుమతి పత్రం కావాల్సిందే. ఇక్కడి ప్రకృతి అందాలే కాకుండా సంస్కృతి కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది.

మిజోరం నీలి పర్వతాల భూమిగా ప్రసిద్ధి చెందిన మిజోరాం భారతదేశంలో కూడా చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ యాత్రను ప్లాన్ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే భారతీయులకైనా సరే తప్పనిసరిగా అనుమతి పత్రం కావాల్సిందే. ఇక్కడి ప్రకృతి అందాలే కాకుండా సంస్కృతి కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది.

5 / 7
లడఖ్
భారత రాష్ట్రమైన లడఖ్‌లోని పర్వత మార్గాలు, నదులు, సరస్సులు, లోతైన లోయ, బౌద్ధ విహారాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ నిర్మించిన ఏటవాలు చెక్క ఇళ్ళు కూడా చాలా అందంగా కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఇక్కడికి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

లడఖ్ భారత రాష్ట్రమైన లడఖ్‌లోని పర్వత మార్గాలు, నదులు, సరస్సులు, లోతైన లోయ, బౌద్ధ విహారాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ నిర్మించిన ఏటవాలు చెక్క ఇళ్ళు కూడా చాలా అందంగా కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఇక్కడికి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

6 / 7
సిక్కిం
భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న సిక్కిం రాష్ట్రం భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రాలలో ఒకటి. అయితే సిక్కిం అనేక అంశాల దృష్ట్యా చాలా ముఖ్యమైన ప్రదేశం. కనుక ఇక్కడకు వెళ్లడానికి ఎవరికైనా అనుమతి అవసరం. ఇక్కడ ప్రపంచంలోని మూడవ ఎత్తైన శిఖరం కాంచన్‌జంగా ఉంది. అంతేకాదు గ్యాంగ్‌టక్‌కు వెళ్లవచ్చు. అక్కడ మీరు ప్రశాంతమైన సమయాన్ని గడపడంతోపాటు షాపింగ్‌ను ఆనందించవచ్చు.  అంతేకాదు సిక్కిలో ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి ఉత్తేజకరమైన కార్యకలాపాలను చేయవచ్చు.

సిక్కిం భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న సిక్కిం రాష్ట్రం భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రాలలో ఒకటి. అయితే సిక్కిం అనేక అంశాల దృష్ట్యా చాలా ముఖ్యమైన ప్రదేశం. కనుక ఇక్కడకు వెళ్లడానికి ఎవరికైనా అనుమతి అవసరం. ఇక్కడ ప్రపంచంలోని మూడవ ఎత్తైన శిఖరం కాంచన్‌జంగా ఉంది. అంతేకాదు గ్యాంగ్‌టక్‌కు వెళ్లవచ్చు. అక్కడ మీరు ప్రశాంతమైన సమయాన్ని గడపడంతోపాటు షాపింగ్‌ను ఆనందించవచ్చు. అంతేకాదు సిక్కిలో ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి ఉత్తేజకరమైన కార్యకలాపాలను చేయవచ్చు.

7 / 7

లక్షద్వీప్
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ను సందర్శించడానికి కూడా అనుమతి అవసరం. నీలి సముద్రం, తెల్లని ఇసుక , పచ్చదనం తో సహజ సౌందర్యం ప్రజలను ఆకర్షించడమే కాకుండా, ఈ ప్రదేశం ప్రత్యేక ఆహారపు రుచులతో ప్రసిద్ధి చెందింది. లక్షద్వీప్‌లో జలక్రీడలను కూడా ఆస్వాదించవచ్చు.

లక్షద్వీప్ భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ను సందర్శించడానికి కూడా అనుమతి అవసరం. నీలి సముద్రం, తెల్లని ఇసుక , పచ్చదనం తో సహజ సౌందర్యం ప్రజలను ఆకర్షించడమే కాకుండా, ఈ ప్రదేశం ప్రత్యేక ఆహారపు రుచులతో ప్రసిద్ధి చెందింది. లక్షద్వీప్‌లో జలక్రీడలను కూడా ఆస్వాదించవచ్చు.