
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. సేమియా: 1 కప్పు,నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు + 1 టీస్పూన్, జీడిపప్పు పలుకులు: 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్: 1 టేబుల్ స్పూన్, నీళ్లు: 2 కప్పులు, పంచదార: 1/2 కప్పు,కేసర్ ఫుడ్ కలర్ (ఆరెంజ్): చిటికెడు, యాలకుల పొడి: 1/2 టీస్పూన్. ఈ పదార్థాలతో చాలా సింపుల్గా సేమియా కేసరి తయారు చేయవచ్చును.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి. నెయ్యి వేడయ్యాక, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసి కాస్త ఫ్రై చేయండి. అవి కొద్దిగా రంగు మారగానే, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియాను తీసుకోండి. మంటను లో నుండి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి, సేమియా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కలుపుతూ బాగా వేయించుకొని, దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఒక కప్పు సేమియాకు రెండు కప్పుల నీరు తీసుకోవాలి . నీళ్లు కొద్దిగా వేడవడం ప్రారంభం కాగానే, వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని అందులో వేసి, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సుమారు ఆరు నుండి ఏడు నిమిషాల ఉడికించుకోవాలి.

తర్వాత సేమియా బాగా ఉడికిన తర్వాత, అర కప్పు పంచదారను అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక వేళ స్వీట్ ఎక్కువ కావాలి అంటే ముప్పావు కప్పు చక్కెర తీసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర కరికి పాకం వచ్చి, సేమియా కాస్త పల్చగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ లేదా, కుంకుమ పువ్వు నీటిని కలుపుకోవచ్చును.

వీటిని కలుపుకోవడం వలన సేమియా మంచిగా, ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక రెండు మూడు నిమిషాల పాటు సేమియాను మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ సేమియా కేసరి రెడీ. దీపావళి పండుగకు ఇది స్పెషల్ స్వీట్ అని చెప్పాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే రుచి అదిరిపోద్దీ.అలాగే, మరింత రుచి కోసం ఒక టీస్పూన్ నెయ్యిని, అర టీస్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. అంతే, కమ్మకమ్మని, పర్ఫెక్ట్ సేమియా కేసరి రెడీ అయిపోయింది.