Laapsi: సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన స్వీట్.. లాప్సి

Updated on: Nov 04, 2026 | 12:43 PM

మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలో శుభకార్యాలు, పండుగలు జరిగినప్పుడు మొదటగా గుర్తొచ్చే దైవికమైన తీపి వంటకం 'లాప్సి'. ఈ స్వీట్‌ను కొందరు పాలతో, కొందరు కొబ్బరిపాలతో, మరికొందరు నీళ్లతో తయారుచేస్తుంటారు. వేదాల ప్రకారం లాప్సి ప్రసాదం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సంపూర్ణ ఆరోగ్యం, కంటి సమస్యల నివారణ మరియు సద్బుద్ధి కలగడం కోసం వరుసగా ఏడు ఆదివారాలు సూర్యోదయ వేళ ఆదిత్య హృదయ స్తోత్రం పఠించి ఈ ప్రసాదాన్ని సూర్యునికి నివేదిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

1 / 5
కావలసిన పదార్థాలు: అర కప్పు ఎర్ర బన్సీ గోధుమ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, అర కప్పు తురిమిన బెల్లం, నీళ్లు ఇక్కడ నీళ్లకు బదులుగా ఆవు పాలు లేదా కొబ్బరిపాలు కూడా వాడుకోవచ్చు, అర కప్పు స్వచ్ఛమైన దేశీ నెయ్యి, 1 టీస్పూన్ యాలకుల పొడి, 10 నుండి 12 జీడిపప్పు పలుకులు, 2 టీస్పూన్ల ఎండు ద్రాక్ష. (ఐచ్ఛికం: నచ్చితే నేతిలో జీడిపప్పుతో పాటు 2 లవంగాలు, చిన్న దాల్చినచెక్క ముక్క కూడా వేసి వేయించుకోవచ్చు)

2 / 5
తయారీ విధానం: స్టవ్‌పై కడాయి పెట్టి అర కప్పు ఎర్రటి బన్సీ గోధుమ రవ్వను వేయాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ గింజ లోపలి వరకు వేగి కమ్మటి సువాసన వచ్చేంత వరకు నిదానంగా వేయించి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి లో ఫ్లేమ్‌పైనే దోరగా వేయించి రవ్వ ఉన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
మరొక గిన్నెలో అర కప్పు తురిమిన బెల్లం, అర కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రెండు పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తీగ పాకం అవసరం లేదు. కడాయిలో సరిగ్గా 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు.. ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి.

4 / 5
మూతపెట్టి మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నిదానంగా ఉడికించాలి. రవ్వను చేతి వేళ్లతో నొక్కి చూస్తే ఎక్కడా పలుకు లేకుండా మెత్తగా ఉడికి ఉండాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే.. సిద్ధం చేసి ఉంచుకున్న బెల్లం పానకాన్ని టీ జల్లెడతో వడకడుతూ పోయాలి. ఉండలు లేకుండా బాగా కలిపి లో ఫ్లేమ్‌పై ఉడికించాలి. రవ్వ బెల్లం పాకాన్ని పీల్చుకుంటున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నిదానంగా దగ్గరపడేంత వరకు కలపాలి. ఆ తర్వాత 1 టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

5 / 5
చిన్న పాన్‌లో మిగిలిన నెయ్యి (సుమారు 3 టేబుల్ స్పూన్లు) వేసి కరిగించాలి. ఇందులో 10-12 జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి. అవి సగం వేగాక 2 టీస్పూన్ల ఎండు ద్రాక్ష వేసి పొంగే వరకు వేపాలి. ఈ వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను నేతితో సహా ఉడుకుతున్న లాప్సిలో పోసి అంతా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే దైవికమైన 'లాప్సి' ప్రసాదం సిద్ధం! పూసపూసగా నిగారింపుతో మెరుస్తూ, నోట్లో వేస్తే నేతి పరిమళం, బెల్లం కమ్మదనంతో కరిగిపోతూ సూర్య భగవానుడి అనుగ్రహాన్ని, అమితమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us