Tourist Places: వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సీజన్‌లో చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది పర్యటనకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో పర్వత ప్రాంతాలను సందర్శిస్తుంటే జాగ్రత్తా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉంది. మీరు హిమాచల్ ప్రదేశ్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మీరు ఏ ప్రదేశాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
మనాలి: మనాలిలో చూడదగిన అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో సోలాంగ్ వ్యాలీ, రోహ్‌తంగ్ పాస్, జోగ్ని జలపాతాలు ఉన్నాయి. చాలా మంది వర్షాకాలంలో మనాలిని సందర్శించడానికి ప్రణాళికలు వేస్తారు. ఇది ప్రమాదకం. ఇక్కడ మేఘావృతమై కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది.
కిన్నౌర్: హిమాచల్‌లో ఉన్న కిన్నౌర్‌లో జూలై, ఆగస్టులలో భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాకాలంలో ఇక్కడ తరచుగా కొండచరియలు విరిగిపడడం జరుగుతుంది. వర్షాకాలంలో కిన్నౌర్‌ని సందర్శించడానికి ప్లాన్ చేయకూడదు. ఇది మీకు ప్రమాదకరం.
డల్హౌసీ: హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న చాలా అందమైన ప్రదేశం. వర్షంలో ఇక్కడికి వెళితే సమస్య అనే చెప్పాలి. వర్షాకాలంలో ఇక్కడ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో డల్‌హౌసీకి ప్రయాణించడం చాలా బాధగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడం మంచిది.
ధర్మశాల: వర్షాకాలంలో మీరు ధర్మశాలను సందర్శించకుండా ఉండాలి. ధర్మశాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇక్కడ కొండచరియలు విరిగిపడవచ్చు. ఇది మీకు విపత్తుగా మారుతుంది. అందుకే వర్షాకాలంలో ధర్మశాలకు వెళ్లకండి.