
గతేడాది భారత్‌లో 15,76,025 కార్లను విక్రయించిన మారుతీ సుజుకీ 2022 లో ఎక్కువ కార్లను అమ్మిన కార్ కంపెనీల జాబీతాలో అగ్రస్థానంలో నిలిచింది.

5,52,511 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్ ఇండియా రెండో స్థానంలో ఉంది.

అదే క్రమంలో టాటా మోటార్స్ 5,26,798 కార్లను విక్రయించి మూడో స్థానంలో ఉంది.

3,35,088 యూనిట్ల విక్రయాలతో మహీంద్రా నాలుగో స్థానంలో ఉంది

2,54,556 యూనిట్ల విక్రయాలతో కియా ఇండియా ఐదో స్థానంలో నిలిచింది.

టయోటా 1,60,357 కార్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలబడింది.

హోండా కార్స్ 95,022 యూనిట్ల విక్రయాలతో ఏడో స్థానంలో ఉంది.

రెనాల్ట్ 81,042 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.

స్కోడా 53,721 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.

గతేడాది48,063 కార్లను అమ్మిన MG మోటార్ పదో స్థానంలో ఉంది.