Tomato Juice: యవ్వనంగా ఉంచే సూపర్ జ్యూస్.. డైలీ తాగితే ఈ సమస్యలకు చెక్ పడినట్లే..

Updated on: Aug 31, 2026 | 4:28 PM

మన వంటింట్లో రోజూ వాడే కూరగాయల్లో టమాటాకు ప్రత్యేక స్థానం ఉంది. టమాటాలను దాదాపు అన్ని రకాల కూరల్లో ఉపయోగిస్తాం.. కేవలం వంటల రుచిని పెంచడానికే కాకుండా, ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుకోవడానికి కూడా టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
రోగనిరోధక శక్తి పెరుగుదల: టమాటా జ్యూస్‌లో లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను (Immunity) బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.

2 / 5
గుండె ఆరోగ్యానికి రక్షణ: క్రమం తప్పకుండా టమాటా జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణాలైన చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) ని తగ్గించడంలో టమాటా జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది.

3 / 5
క్యాన్సర్ నివారణ: టమాటాలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్లు రాకుండా నివారించడంలో టమాటా జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుంది.

4 / 5
మెరిసే చర్మం - యవ్వనం: టమాటా జ్యూస్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, వయసు పెరగడం వల్ల వచ్చే వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

5 / 5
రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ తాజా టమాటా జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే, శరీరానికి అవసరమైన విటమిన్లు అందడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us