
భారత మహిళా బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ ఒలింపిక్స్‌లో సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతం చేసింది. 69 కేజీల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్.. చైనీస్ తైపీ ప్లేయర్ చెన్ నైన్ చిన్‌పై 4-1 తేడాతో విజయం సాధించింది. దీంతో లవ్లీనా బాక్సింగ్‌లో కనీసం క్యాంస్య పతకం గెలుచుకోనుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా.. క్యాంస పతకం దక్కడం మాత్రం పక్కా.

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో టికెన్- మామోని దంపతులకు 1997 అక్టోబర్ 2న లవ్లీనా బోర్గోహైన్ జన్మించింది. లవ్లీనాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. లవ్లీనా తండ్రి టికెన్ బోర్గోహైన్ ఒక చిన్న వ్యాపారి.

లవ్లీనా మొదట్లో కిక్ బాక్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. కానీ, కొంతకాలానికి బాక్సింగ్‌లో అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అందులోకి మారింది.

2011లో లవ్లీనా బర్తాపూర్ బాలిక పాఠశాలలో చదువుతున్నప్పుడు బాక్సింగ్ ఈవెంట్‌లో పాల్గొని గెలుపొందింది. దీంతో తొలిసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది.

తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో దేశానికి ఓ పతకం అందించునున్న మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలవనుంది.

ఇంతకముందు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ బాక్సింగ్ విభాగం నుంచి క్యాంస్యం గెలుపొందారు. ఇక 69 కేజీల విభాగంలో భారత్‌కు క్యాంస్య పతకం రానుండడం ఇదే తొలిసారి.