
సాధారణంగా గ్రహణాలు పట్టినప్పుడు మంచి కన్నా చెడు ఎక్కువ అని చెబుతుంటారు. ఎందుకంటే, ఇది మనిషి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి.

ఇక ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం నేడు మధ్యాహ్నం నుంచి ఏర్పడనుంది. అయితే, దీని ప్రభావం మనం దేశంలో కూడా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, 12 రాశుల్లో ఒక రాశి వారికి కష్టాలతో పాటు పెద్ద గండాలు కూడా తప్పవంటున్నారు. మరి, ఆ రాశి ఏంటో ఇక్కడ చూద్దాం.

ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఈ రోజు మధ్యాహ్నం సింహ రాశిలో సంభవించనుంది. అయితే, ఈ గ్రహణ ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా చూపనుంది. అనుకోని సమస్యలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పని చేసే దగ్గర కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు సింహ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగే, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ఈ సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.

సింహ రాశి వారు మీ కుటుంబ సభ్యులతో గొడవలకు వెళ్ళకండి. అలాగే, మీరు పని చేసే ప్లేస్ లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిన డబ్బును కూడా ఈ సమయంలో అడగకండి, అడిగితే అవి ఎప్పటికి తిరిగి రావు. వైవాహిక జీవితంలో కూడా కొత్త సమస్యలు వస్తాయి.కాబట్టి, జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.