Amnesia: చిన్న విషయాలు కూడా గుర్తుండట్లేదా? ఈ ట్రిక్‌ ఫాలో చేస్తే ఎప్పటికి మర్చిపోరు

|

Nov 27, 2024 | 1:43 PM

నేటి జీవనశైలి కారణంగా చాలా చిన్న వయసులోనే జ్ఞపకశక్తి క్షీణిస్తుంది. దీంతో చిన్న విషయాలు కూడా గుర్తుంచుకోలేక సతమతమవుతున్నారు యువత. ఈ కింది ట్రిక్ ఫాలో అయితే ఏ విషయమైనా జీవితాంతం గుర్తుండిపోతుంది.. అందుకు ఏం చేయాలంటే..

1 / 5
సాధారణంగా అందరిలోనూ ఒక రకమైన మతిమరుపు ఉంటుంది. అయితే ఇది కొందరిలో కాస్త తీవ్రగా ఉంటుంది. దీనిని అలా వదిలేస్తే త్వరలోనే జ్ఞాపకశక్తి కోల్పోవల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న విషయాలైనా, చిన్న విషయాలైనా మర్చిపోవడం సర్వసాధారణం. కానీ సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఇబ్బందులు తప్పవు. అయితే మీకెవరికైనా కూడా తరచుగా మరచిపోయే అలవాటు ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఈ కింది కొన్ని టిప్స్‌ ఫాలో అయితే జ్ఞాపక శక్తికి పదును పెట్టవచ్చు.

2 / 5
నిపుణుల ప్రకారం.. మీ జ్ఞాపకశక్తిని సులభంగా పెంచుకోవడానికి కొన్ని 'రీకాల్ పద్ధతులను' అనుసరించడం మంచిది. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా ముఖ్యమైన విషయాలను మరచిపోకుండా చూసుకోవచ్చు.

3 / 5
మీరు గుర్తుంచుకోవాలనుకుంటున్న విషయం లేదా వస్తువు మొదటి అక్షరాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అక్షరం సహాయంతో మీరు సులభంగా గుర్తుంచుకోగలరు. సాధారణంగా ఇది త్వరగా మరచిపోకుండా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా చిన్న పిల్లలకు కూడా ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది.

4 / 5
R అంటే పునరావృతం. అంటే ఒక్కసారి చదివింది.. మీరు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. ఇలా చదవడం ద్వారా, మెదడులో కంటెంట్ సులభంగా గుర్తుంచుకోవడానికి అవకావం ఉంటుంది. కాబట్టి ఆ విషయం త్వరగా మరచిపోలేరు.

5 / 5
దీర్ఘ విషయాలు గుర్తుంచుకోవడం కష్టంగా ఉన్నప్పుడు వాటిని మూడు భాగాలుగా విభజించడం ద్వారా వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీకు అవసరమైన వస్తువులను చిన్న భాగాలుగా విభజించడం. ప్రతి భాగాన్ని మళ్లీ కనెక్ట్ చేయడం, ఆ అక్షరాలను గుర్తుంచుకోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు దేన్నీ మర్చిపోకుండా గుర్తుంచుకోగలుగుతారు. విద్యార్థులు తాము చదివిన విషయాలను గుర్తుంచుకోవడానికి కూడా ఈ పద్ధతి చాలా సహాయపడుతుంది.