
తొలి ఏకాదశి రోజు జొన్న పేలాల పిండిని కొద్దిగా అయినా తింటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా. నిజం చెప్పాలంటే దీనిని పాత కాలంలో బాగా తినేవాళ్లు. ఈ రోజుల్లో ఎక్కువ తినడమే మానేశారు. దీనిలో వేసే జొన్నలు కూడా ఆరోగ్యానికి బలం. జ్యోతిష్య పరంగా కూడా దీనిని తినాలని అంటున్నారు.

జొన్న పేలాల పిండి పాతకాలపు వంటకానికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు జొన్న పేలాలు , ఒక కప్పు బెల్లం , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు నువ్వులు , ఇంకా మీరు వేసుకోవాలి అనుకుంటే వేరుశెనగలు – కొద్దిగా తీసుకోవచ్చు. ఇవి వేస్తే రుచి కూడా బావుంటుంది.

జొన్న పేలాల పిండి పాతకాలపు వంటకం తయారీ విధానం : మీరు ముందుగా జొన్న పేలాలను తీసుకుని వాటిని బాగా శుభ్ర పరిచి మీడియం మంటపై దీనిని కొద్దిగా వేడి చేయాలి. ఇంకా దీనిని పూర్తిగా చల్లార్చి ఆ తర్వాత వీటిని మిక్సీలో తీసుకుని మెత్తగా పిండి మాదిరి చేసుకోవాలి. ఇది పిండిలాగే ఉంటుంది కాబట్టి.

జొన్న పేలాల పిండి పాతకాలపు వంటకం తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి, ఆ తరవాత దీనిని మంచిగా మళ్లీ మరిగించాలి. ఇంకా ఈ బెల్లం పాకం మంచిగా చిక్కబడిన తర్వాత జొన్న పేలాల పిండిని వేసి దీనిలో మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. అప్పుడే తీపి రుచి ఉంటుంది.

జొన్న పేలాల పిండి పాతకాలపు వంటకం తయారీ విధానం స్టెప్ 2 : ఇక చివర్లో కొద్దిగా నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ మిశ్రమం గట్టిపడే వరకు అలాగే దీనిని ఉండనివ్వాలి. ఇంకా ఈ పొడి చల్లారిన తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని మీరు చిన్న చిన్న ఉండలుగా పిండితో అయినా తినవచ్చు.