
హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 12వ తేదీ నుంచే ప్రారంభమై, జూలై 10న ముగుస్తుంది. ఇక ఈ సమయంలోనే హైదరాబాద్‌లోని ప్రతీ దేవాలయంలో బోనాలతో, పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ గ్రామీణదేవతలను కొలుచుకుంటారు. అయితే ఈ మాసంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటారని, పండతులు చెబుతారు. అందుకే ఈ మాసంలో చాలా వరకు పండగలు జరపరు.

కానీ ఈ మాసంలో తెలంగాణలో మాత్రం ప్రతి రోజూ పండుగే, ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో గ్రామీణ దేవతలకు పూజలు నిర్వహిస్తారు. అయితే గ్రహసంచారం ప్రకారం చూస్తే ఈ సారి ఆషాఢమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందంట. అయితే ఈ మాసంలో సూర్యుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తారు. అందువలన పలు రాశుల వారు ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందంట.

వృషభ రాశి : గ్రహ సంచారం ప్రకారం ఆషాఢ మాసంలో వృషభ రాశి వారికి జాక్ పాట్ తగల నుంచి. ఈ రాశి వారు గ్రామ దేవతలను, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయంట. ఆర్థికంగా కలిసి వస్తుందంట. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. లక్ష్మీ కటాక్షం వలన వ్యాపరస్తులు లాభాలు అందుకుంటారు.

సింహ రాశి : ఆషాఢ మాసంలో సింహ రాశి వారు ప్రతి రోజూ ఒక దేవతను పూజించాలంట. దీని వలన వీరు అనేక లాభాలు పొందుతారు అంటున్నారు పండితులు. ముఖ్యంగా అమ్మవార్లకు బియ్యం పోసి పట్టుబట్టలు సమర్పించడం వలన వీరికి ఏ కోరిక కోరినా నెరవేరుతుందంట. విద్యార్థులకు కలిసి వస్తుంది.

తుల రాశి : గ్రహసంచారం ప్రకారం ఈ మాసంలో అదృష్టం కలిసి వచ్చే రాశుల్లో తుల రాశి ఒకటి. ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలను సందర్శించడం వలన మానసిక ప్రశాంతత దొరకుతుంది. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది.