
చోర్లా ఘాట్: ఇది జలపాతాలు, పొగమంచు కొండలతో కూడిన పచ్చని భూతల స్వర్గం. ఇది గోవా, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. దృశ్యం అద్భుతంగా ఉంటుంది. మీరు ఇక్కడ చాలా వన్యప్రాణులను చూడవచ్చు. ఫొటోగ్రఫేర్లకు కూడా బెస్ట్ ఆప్షన్.

నేత్రావళి వన్యప్రాణుల అభయారణ్యం: ఈ ప్రదేశం దక్షిణ గోవాలో ఉంది. అడవులు, ప్రవాహాలతో నిండి ఉన్న అద్భుతధామం. నేత్రావళి బబుల్ సరస్సు అనేది సహజంగా నీటి బుడగలు వచ్చే ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది ప్రశాంతమైన యాత్రకు ప్రశాంతమైన ప్రదేశం.

తంబ్డి సుర్లా ఆలయం: అడవిలో లోతుగా ఉన్న ఈ పాత ఆలయం ప్రశాంతంగా, అందంగా ఉంటుంద., సమీపంలో జలపాతం ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని రాతి శిల్పాలు వర్షాకాలంలో తాజాగా కనిపిస్తాయి. ఫొటోలకి మంచి ప్రదేశం.

దివార్ ద్వీపం: ఇది పంజిమ్‌కు దగ్గరగా ఉంటుంది. కానీ వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. మీరు ఫెర్రీ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ పాత చర్చిలు, రంగురంగుల ఇళ్ళు, పచ్చని వరి పొలాలను అన్వేషించవచ్చు. ఇవి మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

కేసర్వాల్ స్ప్రింగ్స్: ఈ సహజ నీటి బుగ్గలు వెర్నా సమీపంలో అడవితో చుట్టుముట్టబడి ఉన్నాయి. మంచినీరు, ప్రశాంతమైన ప్రకృతి దీనిని రుతుపవనాలకు అనువైన ప్రదేశంగా మారుస్తాయి. ఇక్కడ ప్రకృతి మంత్రముగ్దులను చేస్తుంది.