
చాలా మంది పండుగల సమయంలో బాస్మతి బియ్యాన్ని షాప్ నుంచి తెచ్చి కొత్త కొత్త వైరైటీలు చేస్తారు. ఇంకా వీటితో బిర్యానీ, పులావ్ చేసుకుని తింటారు. అయితే, ఈ బాస్మతి బియ్యాన్ని కుక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే గింజలు మొత్తం విరిగిపోతాయి. తినడానికి కూడా సరిగా ఉండదు ఇంకా చివరికి అవి అన్నంలాగా మారిపోతాయి. మరి, ఆ తప్పులు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం ..

మనం రోజు తినే బియ్యం, ఇవి ఒకటి కావు వీటిని అలా చూడకండి. ఈ బియ్యాన్ని ఎలా పడితే అలా వీటిని వండకూడదు. వండే పద్ధతి చాలా వేరు అది మాత్రం అస్సలు మర్చిపోకండి. పల్లెల్లో ఉండే వాళ్ళకి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళు బాస్మతి బియ్యం వండేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. మరి, అవేంటో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చదివి ఇక్కడ తెలుసుకుందాం..

నీటి మోతాదు : బాస్మతి బియ్యం మనం రోజు వండుకునే బియ్యం మాదిరి కాదు వీటిని బాగా ఉడకనివ్వాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఇంకా నీటిని కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. బియ్యం ఉడికేంత సరిపోను తీసుకుంటే చాలు అలా మరి తక్కువ కాదు ఒక కప్పు బియ్యనికి రెండు కప్పుల నీరు తీసుకోవాలి లేదంటే ఇవి సరిగ్గా ఉడకవు. అలాగే, నీరు ఎక్కువైనా కూడా ఇది మెత్తగా అయిపోతుంది.

కొందరు ఈ బియ్యం ఉడికేటప్పుడు గరిటే పెట్టి మూడు నాలుగు సార్లు పొయ్యి దగ్గరే ఉండి తిప్పుతూ ఉంటారు. ఇంకా ఇలా చేస్తే అది మొత్తం అన్నం లాగా అయిపోతుంది. ఒక్కసారి మాత్రమే వీటిని కలిపి మూత పెట్టి ఆ తర్వాత రెండో సారి గరిటే పాత్రలో పెట్టకండి ఇలా చేస్తే బియ్యం మొత్తం విరిగిపోతాయి కాబట్టి ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి.

కడగడంలో చేసే పొరపాటులు : ఈ బాస్మతి బియ్యంలో పిండి పదార్థాం అధిక మోతాదలో ఉంటుంది. బాస్మతి బియ్యంలో పిండి పదార్థాం అధిక మోతాదలో ఉంటుంది. కాబట్టి, వీటిని వండే ముందు మూడు సార్లు కడిగితే సరిపోతుంది. అలా అని వీటిని బలంగా చేతులతో తిప్పుతూ అస్సలు కడగకండి. ఈ బియ్యాన్ని కనీసం 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వలన బియ్యం త్వరగా ఉడుకుతాయి