
అరటిపండులో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఫైబర్, ఫొటాషియం ఎక్కువగా ఉంటాయి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఒక అరటిపండు తిడనాలని చెబుతుంటారు. అయితే అరటి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇది తిన్న తర్వాత అస్సలే కొన్ని రకాల పనులు అస్సలే చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Banana

Banana Benfits

అరటి పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. అయితే అరటి పండ్లు తిన్న తర్వాత అస్సలే చల్లటి వస్తువులు, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ లాంటివి అస్సలే తినకూడదంట. దీపి వలన గొంతు సమస్యలు, శ్వాస కోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట.అంతే కాకుండా కొన్ని సార్లు జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు దరి చేరుతుంటాయంట. అందుకే అరటి పండ్లు తిన్న తర్వాత చల్లటి వస్తువులు తినకూడదు.

అలాగే అరటి పండ్లు తిన్న తర్వాత అస్సలే నిద్రపోకూడదంట. కొంత మంది రెండు లేదా మూడు అరటి పండ్లు ఒకసారే తినేసి వెంటనే నిద్రపోతారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. దీని వలన బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను కూడా ఇది ప్రేరేపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.