
కడుపు నొప్పి రాగానే కొంత మంది ఇది గ్యాస్ సమస్య అనుకుంటారు. ఇంకొంత మంది మాత్రం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడం లేదు అందుకే ఈ సమస్యనేమో అనుకుంటారు. కానీ పిత్తాశయంలో రాళ్లు ( గాల్ బ్లాడర్ స్టోన్స్) ఉంన్న సమయంలో కూడా పదే పదే కడుపు నొప్పి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుుల.

గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు, ప్రాథమిక దశలో కడుపు నొప్పి అనేది పదే పదే వస్తుందంట. అయితే ఇలా పదే పదే వస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు వైద్యులు. ఎక్కువగా ఈ నొప్పి అనేది కడుపుకు కుడి వైపున మొదలై, ఓ ఐదు నిమిషాల వరకు నొప్పి అలానే ఉంటుంది. అంతే కాకుండా ఈ నొప్పి కుడి భుజం, వీపై వైపుకు కూడా పాకుతుందంట.

గాల్ బ్లాడర్ స్టోన్స్ లక్షణాల్లోకి వెళ్లితే.. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నప్పుడు కుడివైపు పై భాగంలో తీవ్ర మైన నొప్పి, వాంతులు , వికారం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, పసుపు రంగులోకి కళ్లు మారడం, వెన్ను నొప్పి , జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయంట.

అయితే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి ముఖ్య కారణం తీసుకుంటన్న ఆహారం, జీవనశైలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారంలో పీచు పదార్థం తక్కువగా ఉండటం, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోవడం వలన ఇలాంటి సమస్య ఏర్పడుతుందంట. అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంట.

ముఖ్యంగా పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎవ్వరైనా సరే పదే పదే కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురు అయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నోట్ పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.