Best 40 Inch TV’s: 40 ఇంచుల్లో అదిరిపోయే స్మార్ట్ టీవీలు ఇవే.. తక్కువ ధరలోనే సూపర్ డిజైన్‌తో మతిపోగుడుతున్న ఫీచర్లు

|

Jun 18, 2023 | 4:23 PM

ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్ టీవీలు విరివిగా దొరుకుతున్నాయి. గతంలో కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైన స్మార్ట్ టీవీలు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అన్ని కంపెనీలు పోటీపడి మరి తక్కువ ధరకు స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తుండడంతో సగటు మధ్యతరగతి ప్రజలు స్మార్ట్ టీవీలను ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందరికీ అందుబాటు ధరల్లో 40 ఇంచుల స్మార్ట్ టీవీలు ఉంటాయి. రూ.20 వేల లోపు ధరల్లోనే ప్రీమియం స్మార్ట్ టీవీల్లో వచ్చే ఫీచర్లు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేద్దాం.

1 / 5
టీసీఎల్ స్మార్ట్ టీవీ
40 అంగుళాల స్మార్ట్ టీవీ టీసీఎల్ టీవీ 2 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 1 యూఎస్‌బీ పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్‌తో పాటు వైఫై అందుబాటులో ఉంటుంది. ఇమర్సివ్ డాల్బీ ఆడియోతో వచ్చే ఈ టీవీ ధర రూ.16,990గా ఉంటుంది.

టీసీఎల్ స్మార్ట్ టీవీ 40 అంగుళాల స్మార్ట్ టీవీ టీసీఎల్ టీవీ 2 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 1 యూఎస్‌బీ పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్‌తో పాటు వైఫై అందుబాటులో ఉంటుంది. ఇమర్సివ్ డాల్బీ ఆడియోతో వచ్చే ఈ టీవీ ధర రూ.16,990గా ఉంటుంది.

2 / 5
వన్ ప్లస్ స్మార్ట్ టీవీ
మీరు గొప్ప ఫీచర్లతో కూడిన స్టైలిష్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ కోసం వెతుకుతుంటే మీకు వన్ ప్లస్ టీవీ సరైన ఎంపిక. అలాగే స్పష్టమైన చిత్ర నాణ్యతతో పాటు ఈ టీవీ విస్తృత వీక్షణ కోణాన్ని అందిస్తుంది. ఈ టీవీ చాలా లైట్ వెయిట్‌తో వస్తుంది. ఈ టీవీ ధర రూ.21,990గా ఉంటుంది. ఆన్‌లైన్‌లో బ్యాంకు ఆఫర్లతో కలుపుకుంటే రూ.20 వేల కంటే తక్కువకు అందుబాటులోకి వస్తుంది.

వన్ ప్లస్ స్మార్ట్ టీవీ మీరు గొప్ప ఫీచర్లతో కూడిన స్టైలిష్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ కోసం వెతుకుతుంటే మీకు వన్ ప్లస్ టీవీ సరైన ఎంపిక. అలాగే స్పష్టమైన చిత్ర నాణ్యతతో పాటు ఈ టీవీ విస్తృత వీక్షణ కోణాన్ని అందిస్తుంది. ఈ టీవీ చాలా లైట్ వెయిట్‌తో వస్తుంది. ఈ టీవీ ధర రూ.21,990గా ఉంటుంది. ఆన్‌లైన్‌లో బ్యాంకు ఆఫర్లతో కలుపుకుంటే రూ.20 వేల కంటే తక్కువకు అందుబాటులోకి వస్తుంది.

3 / 5
ఏసర్
ఎల్ఈడీ డిస్‌ప్లేతో రూపొందించిన ఏసర్ 40 అంగుళాల స్మార్ట్ టీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ టీవీకు మీ స్మార్ట్‌ఫోన్‌కు సులభంగా కనెక్ట్ చేయవచ్చు. చిత్ర నాణ్యతపరంగా కొంచెం వెనుకంజలో ఉన్నా సౌండ్ విషయంలో ఈ టీవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టీవీ ధర రూ.16,999గా ఉంది.

ఏసర్ ఎల్ఈడీ డిస్‌ప్లేతో రూపొందించిన ఏసర్ 40 అంగుళాల స్మార్ట్ టీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ టీవీకు మీ స్మార్ట్‌ఫోన్‌కు సులభంగా కనెక్ట్ చేయవచ్చు. చిత్ర నాణ్యతపరంగా కొంచెం వెనుకంజలో ఉన్నా సౌండ్ విషయంలో ఈ టీవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టీవీ ధర రూ.16,999గా ఉంది.

4 / 5
కోడక్ 40 ఇంచుల టీవీ
కొడాక్ నుంచి అత్యుత్తమ 40 అంగుళాల స్మార్ట్ టీవీ 1920 x 1080 హెచ్‌డీ రిజల్యూషన్‌తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్లిమ్, స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఈ టీవీ బ్లూ-రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్‌ను కనెక్ట్ చేయడానికి 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లతో వస్తుంది.సూపర్ సౌండ్ క్వాలిటీతో వచ్చే ఈ టీవీ ధర రూ.15,999గా ఉంది.

కోడక్ 40 ఇంచుల టీవీ కొడాక్ నుంచి అత్యుత్తమ 40 అంగుళాల స్మార్ట్ టీవీ 1920 x 1080 హెచ్‌డీ రిజల్యూషన్‌తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్లిమ్, స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఈ టీవీ బ్లూ-రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్‌ను కనెక్ట్ చేయడానికి 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లతో వస్తుంది.సూపర్ సౌండ్ క్వాలిటీతో వచ్చే ఈ టీవీ ధర రూ.15,999గా ఉంది.

5 / 5
ఎంఐ స్మార్ట్ టీవీ
ఆధునిక ఫీచర్లు, డిజైన్‌లను కలిగి ఉన్న అత్యుత్తమ 40 అంగుళాల స్మార్ట్ టీవీ 178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంది. ఇది చలనచిత్రాలను చూస్తున్నప్పుడు అద్భుతమైన చిత్ర నాణ్యతను అందిస్తుంది. ఇది దాని 24 వాట్స్ డాల్బీ స్పీకర్లతో డాల్బీ సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. ఈ టీవీ ధర రూ.21,990గా ఉంది.

ఎంఐ స్మార్ట్ టీవీ ఆధునిక ఫీచర్లు, డిజైన్‌లను కలిగి ఉన్న అత్యుత్తమ 40 అంగుళాల స్మార్ట్ టీవీ 178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంది. ఇది చలనచిత్రాలను చూస్తున్నప్పుడు అద్భుతమైన చిత్ర నాణ్యతను అందిస్తుంది. ఇది దాని 24 వాట్స్ డాల్బీ స్పీకర్లతో డాల్బీ సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. ఈ టీవీ ధర రూ.21,990గా ఉంది.