
ఉదయ పూర్ , రాజస్థాన్ : తేలికపటి చల్లని సాయంత్రాలు, అందమైన కోటలను అన్వేషించాలి అనుకునే వారికి ఉదయపూర్ చాలా బెస్ట్. ఇక్కడి అందమైన సరస్సులు ఈ సమయంలో మెరుస్తూ కనిపిస్తాయి. అందమైన కోటలు పడవ ప్రయాణాలు, ఘాట్‌ల కేప్‌ల వెంట ప్రయాణించడానికి ఇవి బెస్ట్ ప్లేసెస్ అని చెప్పాలి. మీ స్నేహితులు లేదా, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలి అనుకునే వారు తప్పకుండా ఉదయపూర్ వెళ్లాల్సిందేనంట.

ఫిబ్రవరి నెలలో చూడాల్సిన మరో అందమైన ప్రదేశం వారణాసి. అద్భుతమైన ప్రదేశాల్లో ఇదొక్కటి. మంచుతో కూడిన శీతాకాలాలు, చల్లని ఉదయాల మధ్యన పడవ ప్రయాణాలు చాలా ఆనందాన్ని ఇస్తాయంట. అంతే కాకుండా సాయంత్రం గంగా హారాతి మానసిక ప్రశాతంతను ఇస్తుందని, అందుకే తప్పకుండా ఫిబ్రవరిలో వారణాసి వెళ్లాల్సిందేనంట.

మంచులో ఎంజాయ్ చేయాలి అనుకునే వారు ఫిబ్రవరి నెలలో తప్పకుండా జమ్ము కాశ్మీర్‌లోని గుల్మార్గ్ వెళ్లాల్సిందే. ప్రకృతి ఇచ్చిన అందమై ప్రదేశాల్లో ఇదొక్కటి, చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, మంచు వర్షం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. స్నోబోర్డింగ్ , గొండోలా రైడ్‌లకు ఇది సరైన సమయం. ఇక ఈ సమయంలో ఇక్కడ పర్యాటకులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు.

జీవితంలో ఒక్కసారి అయినా సరే కర్ణాటకలోని హంపి వెళ్లాల్సిందే అంటారు పెద్దవారు. ఫిబ్రవరిలో ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుందంట. అనుకూలమైన వాతావరణం, దేవాలయాలు, నదీ తీరాల మధ్య కుటుంబ సభ్యులతో , స్నేహితులతో ఆనందంగా నడవడం, సైక్లింగ్, అద్భుతమైన సూర్యాస్తమయాలు ఇది నిలయం. అందుకే తప్పకుండా ఫిబ్రవరి నెలలో కర్ణాటక వెళ్లాల్సిందేనంట.

ప్రశాంతంగా బీచ్‌ల వద్ద హాయిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రశాతంగా గడపాలి అనుకుంటే తప్పకుండా అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లాల్సిందేనంట.