Guava Fruits: జామ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరు తిన్నారో బండి షెడ్డుకే!

Updated on: Oct 29, 2025 | 2:00 PM

జామపండ్లు రుచికి బలేగా ఉంటాయి. వీటిల్లో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జామ జీర్ణ సమస్యలు, శారీరక బలహీనతను తగ్గిస్తుంది. అదనంగా దాని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన కణాల నుంచి రక్షిస్తాయి. .

1 / 5
జామపండ్లలో ఫైబర్ దండిగా ఉంటుంది. పచ్చి జామపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీకు ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే ప్రతిరోజూ ఒక జామపండు తినండి. ఇది జీర్ణ సమస్యలను సులువుగా పరిష్కరిస్తుంది.

2 / 5
జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తరచూ అనారోగ్యంతో బాధపడేవారు తమ రోజు వారీ ఆహారంలో జామకాయను చేర్చుకోవడం మంచిది.

3 / 5
జామపండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పచ్చి జామపండు తినడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే మీ డైట్‌లో జామపండు చేర్చుకోవడం మంచిది.

4 / 5
జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.

5 / 5
ముఖ్యంగా శీతాకాలంలో జామపండ్లు మార్కెట్లో దండిగా కనిపిస్తాయి. జామపండ్లు ప్రతిరోజూ అందరికీ సులభంగా లభిస్తాయి. పైగా ధర కూడా తక్కువే. జామపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఒక జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..