
ముందుగా క్యారెట్స్ ను సిద్ధం చేసుకోవాలి : 3 క్యారెట్లను తీసుకుని బాగా శుభ్రం చేసి, చిన్న ముక్కలుగా చేసుకుని తురుముకుని ఒక పాత్ర తీసుకుని బాగా ఉడకబెట్టి పేస్ట్‌లా చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి.

వేయించడం: గ్యాస్ స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, 10 జీడిపప్పులు , 6 బాదం పప్పులు, కిస్ మిస్ లు కూడా వేసి రంగు మారే వరకు బాగా వేయించి పక్కన గిన్నెలో పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ అదే అదే పాన్‌లో ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ తురుము కొద్దిగా పసుపు వేసి, వాసన పోయే వరకు స్టవ్ మీదే ఉంచి నెయ్యిలో 5 నిముషాలు పాటు బాగా వేయించాలి.

ఇప్పుడు పాలు తీసుకుని 4 కప్పులు పోసి క్యారెట్ తురుము వేసి మెత్తబడే వరకు బాగా మరిగించాలి. పాలు మరిగాక చక్కెర అర కప్పు లేదా రుచికి తగినంత వేసి ఒక స్పూన్ యాలకుల పొడిని వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

పాయసం చిక్కబడిన తర్వాత దానిలో జీడిపప్పులు , 6 బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ బాగా స్టవ్ మీదే గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉగాది రోజు క్యారెట్ పాయసం చేసుకుని చేసి నైవేద్యం సమర్పించండి.. దేవతల కటాక్షం మీ సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు.