Banking Coaching: నిరుద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా బ్యాంక్ కోచింగ్.. ఇదిగో పూర్తి వివరాలు

Edited By:

Updated on: Apr 25, 2026 | 4:30 PM

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచిత కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రొబేషనరీ ఆఫీసర్లు , క్లర్క్ పోస్టుల కోసం నిర్వహించే ఈ కోచింగ్ కార్యక్రమం మొత్తం 75 రోజుల పాటు కొనసాగుతుంది. మే 20, 2026 నుంచి హైదరాబాద్‌లోని PETC కేంద్రంలో తరగతులు ప్రారంభమవుతాయి.

1 / 5
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. బ్యాంకింగ్ పరీక్షల కోసం ఉంచితంగా కోచింగ్ ఇవ్వనుంది. ఈ పథకంలో మొత్తం100 సీట్లు కేటాయించారు. ఇందులో 75 ఎస్టీలకు, 15 ఎస్సీలకు, 10 బీసీలకు ఉన్నారు. అలాగే మొత్తం సీట్లలో 33⅓ శాతం మహిళలకు రిజర్వ్ చేశారు.

2 / 5
ఉచితంగా బ్యాంక్ కోచింగ్ పొందాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు.

3 / 5
అయితే ఈ ఉచిత కోచింగ్ ఎంపిక ప్రక్రియ చూసుకుంటే.. దరఖాస్తు దారుల డిగ్రీలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే దీనికి బ్యాంకింగ్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసిన వారు మాత్రమే అర్హులట. అలాగే దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు మించకుండా ఉండాలి.

4 / 5
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం ఆఫీసు పనివేళల్లో అంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని తెలిపారు.

5 / 5
నిరుద్యోగుడకు అండగా నివాలనే ఉద్దేశంతోనే తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Follow Us